అనిరుధ్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. హాట్ టాపిక్ ఆ ఫొటో!

0

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, హీరోయిన్ కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నారని ఇప్పటికే వదంతులు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు వీళ్లద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ ఏడాది చివరి అంకంలో అనిరుధ్, కీర్తి సురేష్ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారని ప్రచారం జరుగుతోంది. వీరి పెళ్లికి కీర్తి సురేష్ తల్లిదండ్రులు అంగీకరించారని.. అనిరుధ్ పెద్దలతో మాట్లాడి పెళ్లి కుదిర్చారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఖండించారు.

కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఖండించినప్పటికీ అనిరుధ్‌తో ఆమె పెళ్లి ఖాయమని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే తమ పెళ్లి తేదీని ఈ సెలబ్రిటీలు ఇద్దరు ప్రకటించనున్నారని చెబుతున్నారు. మరోవైపు, సోషల్ మీడియాలోనూ కీర్తి సురేష్ పెళ్లిపై ప్రచారం జరుగుతోంది. వాళ్లిద్దరూ కచ్చితంగా ప్రేమలో ఉన్నారని చెబుతూ గతంలో కీర్తి సురేష్ షేర్ చేసిన ఫొటోను ఆధారంగా చూపుతున్నారు. గతేడాది అక్టోబర్‌లో అనిరుధ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కీర్తి సురేష్ రెండు ఫొటోలు షేర్ చేశారు. ఈ ఫొటోల్లో కీర్తి సురేష్‌‌తో అనిరుధ్ చాలా సన్నిహితంగా ఉన్నారు. ఒక ఫొటోలో కీర్తి సురేష్ భుజంపై అనిరుధ్ చేయి వేశారు.
ఇదిలా ఉంటే, సింగర్ జోనితా గాంధీతో అనిరుధ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అలాగే, చెన్నైకు చెందిన ఒక వ్యాపారవేత్తను కీర్తి సురేష్ పెళ్లాడబోతున్నారని అన్నారు. కానీ, ఈ రెండింటిలో ఏదీ ఖరారు కాలేదు. ఇప్పుడు అనిరుధ్-కీర్తి సురేష్ పెళ్లి వార్త హాట్ టాపిక్‌గా మారింది. అయినా దీనిలో నిజమెంతో తెలీదు. దీనిపై స్పష్టత రావాలంటే అనిరుధ్, కీర్తి సురేష్ స్పందించాల్సిందే.