కానుకలిచ్చి ఇస్మార్ట్ బ్యూటీని బుట్టలో వేశాడు

0

ఒక గొప్ప సంతోషకర విషయాన్ని షేర్ చేసుకోవాలంటే అంతకుముందే మంచి కానుక ఇచ్చి ఆనందింపజేయాలి. ఈ విషయంలో మన హీరోలు పది ఆకులు ఎక్కువే తింటారు. యంగ్ ట్యాలెంటెడ్ హీరో సాయి తేజ్ ఇలాంటి విషయాల్లో అస్సలు తక్కువేమీ కాదు. కానుకలిచ్చి కథానాయికల్ని బుట్టలో వేయడంలో అతడి తర్వాతనే. సెట్లో స్నేహం కుదిరాక ఇవన్నీ మామూలే కానీ.. ఇప్పుడు బహుమతులు ఇచ్చేంత గొప్ప సందర్భం ఏం వచ్చి ఉంటుంది? అంటారా..

బెంగళూరు సోయగం నభా నటేష్ కి సాయి తేజ్ నుంచి అదిరే గిఫ్ట్ అందింది. ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ (SBSB) చిత్రీకరణ పూర్తయింది. SBSB సెట్ లో నభా చివరి రోజు సాయి ఆమెకు కొన్ని చిరస్మరణీయ బహుమతులు ఇచ్చారు. ఇదే విషయాన్ని నభా ఎంతో మురిపెంగా చెప్పుకొచ్చింది.

నాభా ఇన్ స్టాగ్రామ్ లో సాయి తేజ్ ఇచ్చిన బహుమతులను చూపించే వీడియోను షేర్ చేసింది. బహుమతి పెట్టెలో “థాంక్యూ నభా” అని రాసి ఉంది. అందమైన తెల్లని దుస్తులు.. నభా ఫోటో ఫ్రేమ్.. మరి కొన్ని సౌందర్య సాధనాలు కూడా ఇందులో ఉన్నాయి. సాయి తేజ్ గుండె గిచ్చేలా హత్తుకునే పిలుపుతో కూడుకున్న సంజ్ఞను ఇవ్వడంతో నభా చాలా ఆశ్చర్యపోయిందని అర్థమవుతోంది. SBSB నిర్మాణానంతర పనుల దశలో ఉంది. థియేట్రికల్ రిలీజ్ కష్టమే కాబట్టి.. OTT విడుదలకు సిద్ధమవుతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి డెబ్యూ సుబ్బూ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నిర్మాత బివిఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.