మిడిల్ క్లాస్ స్నేహితులను ఎప్పటికీ వదలదట!

0

సాయి పల్లవి.. మలయాళ హిట్ చిత్రం `ప్రేమమ్`తో పాపులర్ అయ్యింది. తెలుగులోనూ రీమేక్ చేస్తే ఇక్కడా ఆ మూవీ బ్లాక్ బస్టర్. ఆ సినిమా క్రేజ్ తో సెన్సిబుల్ డైరెక్టర్ కమ్ముల `ఫిదా`కి ఎంపిక చేసుకున్నారు. ఆరంభమే తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసిందీ మలయాళీ సోయగం. `ఫిదా` తరువాత తెలుగు- తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపుని తెచ్చుకుంది. ఎంత స్టార్ స్టేటస్ వచ్చినా సింపుల్ గా వుండటం సాయి పల్లవి ప్రత్యేకత.

మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించే సాయి పల్లవి తాజాగా తన మిడిల్ క్లాస్ స్నేహితులతో కొంత సమయాన్ని గడిపింది. దీనికి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. చిన్నతనం నుంచి సాయి పల్లవితో కలిసి తిరిగిన వాళ్లలో చాలా మంది మిడిల్ క్లాస్ బిలో మిడిల క్లాస్ కి చెందిన వారే ఎక్కువగా వున్నారట.

తను స్టార్ హీరోయిన్ అయినా ఎక్కడా ఆ ఫీలింగ్ ని హెడ్ కి ఎక్కించుకోకుండా తన ఫ్రెండ్స్ ని అదే ప్రేమతో చూస్తోందీ నేచురల్ బ్యూటీ. సహజమైన నటనతో వెండితెరపై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ మన ఇంట్లో అమ్మాయి అనే ఫీల్ ని కలిగిస్తోంది. తన చిన్ననాటి స్నేహితులతో కలిసి ఇటీవల సెలయేళ్లతో పాటు వాగు వంకల్లో షికార్లు చేస్తూ ఎంజాయ్ చేసింది. చెట్టు ఊడల్ని ఉయ్యాలగా చేసుకుని ఉయ్యాలూగింది. ఒక్కసారిగా తన చిన్న నాటి స్నేహితులతో కలిసి చిన్న పిల్లగా మారి అల్లరి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అన్నట్టు ఎత్తు నుంచి దిగువకు పారే నీటితో చాలా ప్రమాదం. మనాలి- బియాస్ నదిలో ప్రమాదం ఇలాంటిదే.. మరువలేనిది కూడా. అయినా సాయి పల్లవి డేరింగే వేరనేందుకు ఇదిగో ఇదే ప్రూఫ్.