సామ్.. రవివర్మ చెక్కిన శిల్పం ఉన్నట్టుండి ఏమిటిలా..!

0

సోషల్ మీడియా గేమ్ ఛేంజర్ గా మారినప్పటిరి నుంచి సెలబ్రిటీలు నిత్యం అభిమానులతో టచ్ లో వుంటున్నారు. తమకు సంబంధించిన సినిమా విషయాలతో పాటు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ తమ వైఖరిని నిక్కచ్చిగా వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో స్టార్స్ ఎంపిక చేసుకునే డీపీలకి చాలా ప్రత్యేకత వుంటోంది.

కొంతమంది ప్రముఖులు తరచుగా వారి మీడియాల్లో ప్రదర్శన చిత్రాన్ని ప్రొఫైల్ లో మారుస్తుంటారు. కానీ అది కొద్ది మంది మాత్రమే తమ డీపీని ప్రతిసారీ మార్చడానికి ఇష్టపడరు. అలాంటి వారి జాబితాలో సమంత .. పవన్ .. ఎన్టీఆర్.. లాంటి వాళ్లు వున్నారు. అయితే సమంత తాజాగా తన డీపీని మార్చేయడం షాకిస్తోంది. గత ఏడాది ప్రముఖ ఫొటోగ్రాఫర్ జి. వెంటకరామన్ ది గ్రేట్ పెయింటర్ రవివర్మ చిత్రాలని పునః సృష్టించే క్రమంలో క్రేజీ తారలపై ఓ ఫొటో షూట్ ని నిర్వహించిన సంగతి విధితమే.

ఈ ఫొటో షూట్ లో సమంతతో పాటు శృతిహాసన్ .. ఖుష్బూ.. నదియ.. సుహాసిని.. ఐశ్వర్యారాజేష్.. లక్ష్మీ మంచు రవివర్మ పేయింట్స్కి తగ్గట్టుగా ఫొటోలకి పోజులిచ్చారు. దీనికి సంంధించిన ఫోటోని తన డీపీగా పెట్టుకున్న సామ్ 9 నెలల విరామం తరువాత మార్చేసింది. ఆ ఫోటోలో వింటేజ్ లుక్ లో గ్రామీణ యువతిగా కనిపించిన సామ్ మరింత గ్లామరస్ గా మోడ్రన్ యువతిగా కనిపించే ఫొటోని డీపీగా మార్చేసింది. ఈ సరికొత్త మోడ్రన్ లుక్ కి ఆ డ్రెస్ కి ఫ్యాన్స్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది.