అరే.. నో బిగ్గినీ అంటూ నిరాశపరిస్తే ఎలా?

0

కొద్ది రోజులుగా అందాల కథానాయికలంతా మాల్దీవుల విహారంలో చిలౌట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అరడజను పైగా భామలు మాల్దీవుల్లో బీచ్ సెలబ్రేషన్ నుంచి బికినీ ఫోటోల్ని షేర్ చేసి అభిమానులకు కంటిపై కునుకు పట్టనీకుండా చేశారు.

కాజల్- రకుల్ ప్రీత్- తాప్సీ-పరిణీతి- ఎల్లీ అవ్ రామ్- మలైకా తదితర భామల బోల్డ్ ఫోటోషూట్లు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా బులుగు సముద్రం చెంత శాండ్ బీచ్ లో బికినీ షూట్లతో ఈ భామలంతా హీట్ పెంచేశారు. దీంతో సమంత పైనా అంతే భారీ అంచనాలు పెరిగాయి.

కానీ సామ్ మాత్రం `నో బిగ్గినీ షూట్!` అంటూ ఆ ఎపిసోడ్ నే కట్ చేసేయడంతో అభిమానులకు నిరాశ తప్పలేదు. ఇంతకుముందు మాల్దీవుల విహారం నుంచి కొన్ని వేడెక్కించే ఫోటోల్ని షేర్ చేసినా బికినీని క్లోజప్ లో హైలైట్ చేస్తూ ఏ ఫోటోని రివీల్ చేయలేదు. దీంతో సామ్ హాటెస్ట్ బికినీ షూట్ మునుముందు అయినా రిలీజ్ చేస్తుందనే భావించారంతా. కానీ ఇంతలోనే ఇలా షాకింగ్ న్యూస్ చెప్పారు మ్యాడమ్. ఇక ఫోటోషూట్లలో ఎక్కడా వల్గారిటీ అన్నది లేకుండా అక్కినేని కోడలు ఎంతో జాగ్రత్త తీసుకున్నారని అభిమానులు భావిస్తున్నారు. చైతన్య- సమంత జంట మాల్దీవుల విహారం ఎప్పటికీ మరువలేని తీపి జ్ఞాపకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బికినీ లేకపోవడమే అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.

అన్నట్టు బిగ్గినీ అంటే ఏమిటి? అంటే…ఈ పదం 2011 రియాలిటీ షో `ఎమోషనల్ అత్యాచార్` సీజన్ 3 సందర్భంగా ప్రాచుర్యం పొందింది. బిగ్గినీ షూట్ అనేది పాట రూపంలోనూ పాపులరైంది. అప్పటి నుంచి బికినీకి బదులుగా బిగ్గినీ అనేది ఉపయోగిస్తున్నారు.

కెరీర్ సంగతి చూస్తే.. సమంత నటించిన `ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ డిసెంబర్ లోనే OTT లో స్ట్రీమింగ్ కానుంది. ఆహా కోసం సామ్ జామ్ అనే టాక్ షోను కూడా సమంత నిర్వహిస్తోంది.