Templates by BIGtheme NET
Home >> Cinema News >> ట్రాయ్ రాకుమారి అయినా తల దించుకునేలా..!

ట్రాయ్ రాకుమారి అయినా తల దించుకునేలా..!


ఆస్కార్ లు కొల్లగొట్టిన గ్రేట్ హిస్టారికల్ వార్ మూవీ `ట్రాయ్` కాస్ట్యూమ్స్ విభాగం గురించి ప్రత్యేక ప్రస్థావనకు వచ్చింది. గ్రీకు రాజుల చారిత్రక కథాంశం కావడంతో భారీ తనంతో నిండిన గొప్ప రాజప్రాకారాలు.. రాజులు..రాణులు.. రాకుమార్తెలు.. భారీ యుద్ధాలతో మూవీ టోన్ ఆద్యంతం చరిత్రను కళ్ల ముందు సజీవ సాక్ష్యంగా నిలిపింది. ఈ మూవీలో రాజులే కాదు రాణులు రాకుమార్తెల కాస్ట్యూమ్స్ కూడా అంతే ఆకట్టుకుంటాయి. చూస్తుంటే సామ్ కాస్త అటూ ఇటూగా ట్రాయ్ రాకుమారినే తలపిస్తోంది. ఈ డిజైనర్ లుక్ ఎంతో సింపుల్ గా కనిపిస్తోందో అంతే వైబ్రేంట్ గా ఆకర్షిస్తోంది. పసుపు పర్పుల్ మిక్స్ డ్ డిజైనర్ డ్రెస్ కి కాంబినేషన్ గా.. ఆ చెవులకు ధరించిన అర్థ సూర్యుని జూకాలు అంతే ఆకర్షణను పెంచాయి. ఇక ఆ హెయిర్ కి గ్రే- రెడ్ కలర్ కూడా ట్రాయ్ కల్చర్ కి సింబాలిక్ గా కనిపిస్తోంది.

పెళ్లి తర్వాత ఫ్యాషనిస్టాల జాబితాలో సామ్ పేరు ఇప్పటికీ వినబడుతోంది అంటే అది ఫ్యాషన్ ప్రపంచంపై తన ప్రత్యేక ఆసక్తి.. సెలెక్షన్ దాంతో పాటు తీసుకునే శ్రద్ధ వల్లనే. ఇప్పటికిప్పుడు బ్రాండ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న స్టార్ గా సమంత ఓ వెలుగు వెలుగుతోంది. దాంతో పాటే ఆర్జకురాలిగా పేరు ఘడిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.

ఇక నాగ చైతన్య- సాయి పల్లవి నటించిన `లవ్ స్టోరి` టీజర్ నిన్న విడుదల కాగా.. దానిపై సామ్ ఒపీనియన్ వైరల్ అయ్యింది. నాయకానాయికల మధ్య అద్భుత కెమిస్ట్రీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక నిమిషం టీజర్ ప్రేమ.. పెయిన్.. ఆశ.. నిరాశ.. కష్టం దుఃఖం అనే కోణంలో అందమైన ప్రయాణాన్ని ఆవిష్కరించింది.

తన భర్త చైతన్య నటనను ప్రశంసించడమే గాక సమంత కూడా టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఆగలేకపోయారంటే అర్థం చేసుకోవాలి. “ఎవరూ ఇంత బాగా చేయరు చై అక్కినేని .. మీరు అంతకంతకు బలంగా పెరుగుతూ ఉన్నారు ..“ అంటూ సామ్ ప్రశంసలు కురిపించింది.

సామ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఆహాలో సామ్ జామ్ కార్యక్రమం పెద్ద విజయం సాధిస్తోంది. తదుపరి నటించాల్సిన సినిమాలపైనా సామ్ రివ్యూలు చేస్తున్నారట.