‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అప్డేట్ ఇచ్చేసిన సామ్…!

0

అక్కినేని సమంత ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ద్వారా వెబ్ వరల్డ్ లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. ఇది ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 1కు కొనసాగింపుగా వస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ మంచి ఆదరణని దక్కించుకోవడంతో సీజన్ 2 పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తుండటంతో ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి రెట్టింపైంది. ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన సమంత.. తాజాగా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ కు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది.

కాగా సమంత ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ ఫొటోలో సమంత కనపడకుండా మైక్రోఫోన్ మరియు ఎదురుగా స్క్రీన్ మీద ఓ సీన్ ని చూపించింది. ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 డబ్బింగ్ చెప్తున్నాను. మీరు క్రేజీ రైడ్ కోసం ఉన్నారు. థ్యాంక్ యూ’ అని రాసుకొచ్చి రాజ్ – డీకే లను ట్యాగ్ చేసింది సామ్. అయితే సినిమాల్లో సమంత పాత్రకి గాయని చిన్మయి డబ్బింగ్ చెప్తుంటారు. కానీ ఈ మధ్య తాను నటించే సినిమాలకు సామ్ స్వయంగా డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో ఈ వెబ్ సిరీస్ కోసం సమంత తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలోనూ డబ్బింగ్ చెప్తోందని తెలుస్తోంది.

కాగా ఈ వెబ్ సిరీస్ లో సమంత పాకిస్తానీ టెర్రరిస్ట్ పాత్రలో కనిపించనుందని సమాచారం. దీంతో సామ్ పాన్ ఇండియా వైడ్ ఫేమస్ అయిపోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో మనోజ్ బాయ్ పాయ్ – ప్రియమణి – సందీప్ కిషన్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.