మెగా అక్కినేని కోడళ్ల పాక శాస్త్ర నైపుణ్యం

0

ఘుమాయించే వంట వండడం అన్నది కొందరికే అబ్బే విద్య. అది అందరికీ సాధ్యం కానిది. ఇక్కడ కోడళ్ల సందడి చూస్తుంటే ముచ్చటేయడం లేదూ? నల భీమ పాకం వండేస్తున్నారు. ఇక కోడళ్ల పాక శాస్త్ర నైపుణ్యం ఏపాటిది? అన్నది తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

అక్కినేని కోడలు సమంత అక్కినేని.. మెగా కోడలు ఉపాసన రామ్ చరణ్ ఇటీవలే వెల్ నెస్ కి సంబంధించిన ‘యుఆర్ లైఫ్’ వెబ్ సైట్ ని ప్రారంభించి అందులో స్పెషల్ వీడియో ట్రీట్ తో కట్టిపడేస్తున్న సంగతి విధితమే. ఈ వేదిక లక్ష్యం ట్రెండింగ్ ఆరోగ్య చిట్కాలు.. పోషణ… ఆహార ప్రణాళికలు.. జీవనశైలి వగైరా వ్యవహారాలపై విలువైన విషయాల్ని అభిమానులకు షేర్ చేయనున్నారు.

సామ్ ఈ వెబ్ సైట్ కి గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మొదటిసారి తనలోని వంట నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఓ వీడియోతో ముందుకు వచ్చారు అక్కినేని కోడలు. ఉపసానతో కలిసి ‘తక్కలి సడం’ అనే తమిళ వంటకం వండడం కనిపిస్తోంది. ఇందుకు ఉపయోగించే పదార్థాలు.. రెసిపీని ఈ వీడియోలో చూపించారు. సమంత – ఉపసన ఎంతో జోవియల్ గా ఈ వంట కార్యక్రమాన్ని రంజింపజేసారు.

సమంత ఇటీవల రూఫ్ టాప్ వ్యవసాయంపై టిప్స్ చెప్పిన సంగతిని మరువలేం. గచ్చిబౌళి ఇంటిపై ఈ ప్రయోగం చేసారు. ఆరోగ్యకరమైన పంటను పండించడమెలానో తెలిపారు సామ్. అలాగే తాను వంటకం కోసం సాధారణ బియ్యం కంటే బ్రౌన్ రైస్ ను ఇష్టపడతానని తెలిపారు. వణక్కం.. రుంభ నల్ల ఇరిక్కుం! అంటూ తమిళంలో ఈ వంటల ప్రోగ్రామ్ ని ఆవిష్కరించారు. ఇకపోతే ఉపాసన అచ్చం తన అమ్మ గారి లానే తమిళం మాట్లాడుతున్నావని కాంప్లిమెంట్ ఇచ్చేసింది సామ్.