షాక్ లో కేజీఎఫ్ 2 టీమ్.. సంక్రాంతికి కష్టమే..?

0

తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిన చందంగా ఉంది నేటి సీన్. సినీపరిశ్రమల మనుగడకు పెను ప్రమాదం వాటిల్లింది. మహమ్మారీ అన్ని పరిశ్రమల కంటే సినీపరిశ్రమనే దారుణంగా దెబ్బ తీసింది. ఇన్నాళ్లు షూటింగుల్లేవ్.. ఇకనైనా జరుగుతాయో లేదో క్లారిటీ లేదు. ఇకనైనా షూటింగును తిరిగి ప్రారంభించాలని అనుకుంటే ఇంతలోనే ఊహించని షాక్ తగిలింది కేజీఎఫ్ బృందానికి.

బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అధీరా గెటప్ ని ఇంతకుముందు రివీల్ చేస్తే ఫ్యాన్స్ లో విశేష స్పందన వచ్చింది. ఈ అక్టోబర్ నుంచి బెంగళూరులో రాక్ స్టార్ యశ్- సంజయ్ దత్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాల్సి ఉందిట. రెండు భారీ యాక్షన్ సన్నివేశాలు పెండింగులో ఉన్నాయి. త్వరలోనే షూటింగ్ అంటూ ప్రశాంత్ నీల్ బృందం భాయ్ కి కబురంపారు. ఇంతలోనే స్టేజ్ 3 క్యాన్సర్ దశలో సంజయ్ దత్ అంటూ వార్తలు వచ్చాయి. తాజా కథనాలకు కేజీఎఫ్ టీమ్ ఖంగు తిందిట.

ఇది ఊహించలేదని సడెన్ షాక్ కి గురయ్యామని కేజీఎఫ్ 2 చిత్రబృందం ఓ ప్రకటనలో వెల్లడించింది. వారం క్రితమే సంజయ్ దత్ తో తదుపరి చిత్రీకరణపై ముచ్చటించామని వెల్లడిస్తున్నారు. సంజయ్ దత్ ఇప్పుడు నాలుగో దశ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అతడు వెంటనే అమెరికాకు వెళుతున్నారు. ఆయన తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక తాజా డిలేతో కేజీఎఫ్ 2 సంక్రాంతికి అయినా రిలీజవుతుందా? అంటే సందేహమే.