ఆకాశమే నీ హద్దురా కోసం ఉమామహేశ్వర

0

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాను త్వరలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగు వర్షన్ లో హీరో సూర్య పాత్రకు గాను టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో నటుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సత్యదేవ్ మొదటి సారి తనకు ఇష్టమైన నటుడు సూర్యకు డబ్బింగ్ చెప్పేందుకు సిద్దం అయ్యాడు. ఈ సినిమాకు సత్యదేవ్ డబ్బింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకంను చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

తెలుగు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన సూరారై పొత్రు సినిమాను తెలుగులో ఆకాశమే నీ హద్దుగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో సూర్యకు జోడీగా అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ స్టార్ నటుడు మోహన్ బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. తెలుగు మరియు తమిళంలో కూడా ఈ సినిమాను భారీగా థియేటర్ లలో విడుదల చేయాలని భావించినా కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నెల 15 నుండి థియేటర్ల అన్ లాక్ కు కేంద్రం ఓకే చెప్పింది. ఈ సమయంలో సూర్య సినిమా విడుదల విషయంలో మేకర్స్ నిర్ణయాన్ని మార్చుకుంటారా అనేది చూడాలి.