ఇదెప్పుడు చేశావ్ సత్య?

0

సత్యదేవ్ హీరోగా ఈమద్య కాలంలో వరుసగా సినిమాలు వస్తున్నాయి. ఓటీటీ ద్వారా ఈ మద్య కాలంలో సత్యదేవ్ మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మరో మూడు సినిమాలు ఈయన చేస్తున్నాడు. ఆ సినిమాలు థియేటర్లు ఓపెన్ అయితే థియేటర్లలో లేదంటే ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈయన సినిమాలు అనగానే ఎక్కువ శాతం మంది గుర్తుందా శీతాకాలం గురించి మాట్లాడతారు. ఎందుకంటే అందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది కనుక. కాని సత్యదేవ్ వచ్చే నెలలో గువ్వ గోరింక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

ఈ సినిమా మొదలు అయిన విషయం.. షూటింగ్ జరుగుతున్న విషయం కూడా ఎక్కువగా మీడియాలో ఫోకస్ అవ్వలేదు. సింపుల్ గా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి. అమెజాన్ ప్రైమ్ ద్వారా వచ్చే నెల 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రకటన అందరికి ఆశ్చర్యంను కలిగించింది. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య వంటి విభిన్నమైన సినిమాను చేసిన సత్యదేవ్ నుండి సినిమా అనగానే అంచనాలు భారీగా ఉంటాయి. అలాంటిది ఈ సినిమా హఠాత్తుగా విడుదల తేదీ ప్రకటించడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు చేశావ్ ఉమా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.