ఆస్కార్ 2021 భారత్ నుంచి అధికారిక లఘుచిత్రమిదే

0

సయాని గుప్తా నటించిన సిగ్గులేనిది లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ 2021 కోసం భారతదేశం యొక్క అధికారిక ప్రవేశం ప్రతియేటా జనవరిలో ఆస్కార్ ల సందడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. నెల రోజుల ముందు నుంచే అకాడెమీ అవార్డులకు వెళ్లే భారతీయ సినిమాలు ఏవి? అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతుంటుంది. ఈసారి అస్కార్ కి వెళ్లే భారతీయ సినిమాలేవి? అన్నది ఇంకా రివీల్ కావాల్సి ఉంది.

తాజా సమాచారం ప్రకారం..లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో సయాని గుప్తా- హుస్సేన్ దలాల్- రిషబ్ కపూర్ నటించిన లఘు చిత్రం `షేమ్ లెస్` ఆస్కార్ 2021 కు భారత్ నుంచి అధికారికంగా ఖాయమైంది. ఈ చిత్రానికి కీత్ గోమ్స్ దర్శకత్వం వహించారు.

నేషనల్ అవార్డ్స్ అలాగే ఆస్కార్ బరిలో నిలిచిన ఈ చిత్రంలోని తారాగణం సిబ్బందికి కీత్ గోమ్స్ కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబీకుల సాయం స్నేహితుల నుండి సాయం పొందిన పరిమిత నిధులతో ఈ సినిమా తీశానని చెప్పారు. ప్రతి ఒక్కరూ చాలా ప్రేమపూర్వకంగా అభిరుచితో కలిసి పని చేశారని ఆయన అన్నారు. ఇంతకుమించిన ఆశీర్వాదం మరొకటి లేనేలేదని గోమ్స్ భావోద్వేగానికి గురయ్యారు.

షేమ్ లెస్ లఘు చిత్రం గత ఏడాది ఏప్రిల్ లో విడుదలైంది. ఇది షాన్ వ్యాస్ `నాట్ కథ్`.. ఆదిత్య కెల్గావ్కర్ `సౌండ్ ప్రూఫ్`.. సఫర్ .. ట్రాప్డ్ లాంటి టాప్ క్లాస్ లఘు చిత్రాలతో పోటీపడి ఎంపికైంది.