శర్వానంద్ `ఆడాళ్లు మీకు జోహార్లు` మొదలైంది

0

శర్వానంద్ హీరోగా ప్రస్తుతం రెండు చిత్రాలు లైన్ లో వున్నాయి. వెంటనే మరో చిత్రాన్ని ట్రాక్ లోకి తీసుకొచ్చాడు. శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం `ఆడాళ్లు మీకు జోహార్లు`. గతంలో ఈ చిత్రాన్ని హీరో విక్టరీ వెంకటేష్ తో కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు. నిత్యామీనన్ హీరోయిన్. కానీ అనివార్య కారణాల వల్ల అది సెట్స్ పైకి రాకుండానే ఆగిపోయింది. ఇదే చిత్రాన్నికొంత విరామం తరువాత ఇప్పుడు శర్వాతో తెరపైకి తతీసుకొస్తున్నారు.

ఈ ఉదయం ప్రారంభమైన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో శర్వాకు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. విజయదశమి సందర్భంగా ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి .. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ . శర్వాతో `శ్రీకారం ` చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ ఆచంట.. గోపీచంద్ ఆచంటతో పాటు కొంత మంది పాల్గొన్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం హీరో శర్వానంద్ .. హీరోయిన్ రష్మిక మందన్నలపై చిత్రీకరించిన మూహూర్తపు సన్నివేశానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్లాప్ నిచ్చారు. అనంతరం చిత్ర బృందం తిరుమల దేశస్థానాన్ని సందర్శించి శ్రీవెంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందుకుంది.