సుశాంత్ ఇష్యూను ఇంకా వాడుకునే ప్రయత్నం చేస్తోంది

0

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణించిన వెంటనే ఆయన అభిమానులు చాలా మంది రియా కారణంగా మృతి చెందాడు అంటూ ఆరోపించడం మొదలు పెట్టారు. కొందరు మాత్రం బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం కారణంగానే సుశాంత్ చనిపోయాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కంగనా ఎంట్రీ ఇచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సుశాంత్ మరణంకు బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం బ్యాచ్ అని వారు ఒక మాఫియాగా ఏర్పడి ప్రతిభ ఉన్న వారిని తొక్కేస్తూ తమ వారికి ఆఫర్లు ఇచ్చుకుంటుందని విమర్శలు చేయడం ప్రారంభించింది.

సుశాంత్ కేసులో మొదట్లో ఆమె చేసిన వ్యాఖ్యలను కొందరు సీరియస్ గా పరిగణించే వారు. ఆమె చెబుతున్న దాంట్లో నిజం ఉందేమో అనుకున్నారు. కాని ఆ తర్వాత సుశాంత్ కేసు పేరుతో తనకు కక్ష ఉన్న కరణ్ జోహార్.. మహేష్ భట్ వంటి ప్రముఖుల పేర్లను పదే పదే ఈ వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించడంతో సుశాంత్ మృతిని తన వ్యక్తిగత అజెండాకు ఉపయోగించుకుంటుందని కొందరు అనుమానించడం మొదలు పెట్టారు. ఇప్పటికే సుశాంత్ కుటుంబం తరపు వాదిస్తున్న లాయర్ ఈ విషయంలో కంగనా మరీ ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తుందని.. తన వ్యక్తిగత అజెండాను ఈ విషయంలో జొప్పించే ప్రయత్నం చేస్తుందంటూ చురకలంటించాడు. దాంతో కాస్త సైలెంట్ అయినట్లుగా అనిపించిన కంగనా మళ్లీ నేడు ట్విట్టర్ లో రెచ్చి పోయింది.

బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు అతడు హత్య చేసి యద్దేచ్చగా తిరుగుతున్నాడు అంటూ ఏకంగా ప్రధాని మోడీని ట్యాగ్ చేసి ట్వీట్ చేసింది. ఇక తనను ట్రోల్ చేసిన వారి ట్వీట్ ను ముంబయి పోలీస్ కమీషనర్ లైక్ చేయడం అత్యంత దారుణం అంటూ కంగనా ఆరోపించింది. అయితే ఆ విషయాన్ని పోలీసులు కొట్టిపారేశారు. అందుకు సంబంధించిన సైబర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అన్నారు. ఇక డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలంటూ సూచించింది.