ఎంత క్రేజ్ తీసుకొచ్చి ఏం లాభం.. ఓటీటీ రిలీజ్ చేస్తుంటే…!

0

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ‘నో పెళ్లి’ వీడియో సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘హే ఇది నేనేనా..’ అనే మరో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మంచి ఆదరణ తెచ్చుకుని యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో సాంగ్స్ తో హిట్ కొట్టారు.. సినిమా కూడా హిట్ కొడతారంటూ మెగా అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి మాత్రం దీని గురించి నీరసమైన సమాధానాలు వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.

కాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాని సమ్మర్ లో సోలోగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.. కానీ కరోనా కారణంగా కుదరలేదు. కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుండటంతో థియేటర్స్ ఇప్పట్లో రీ ఓపెన్ చేసేలా కనిపించడం లేదు. ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్షన్ లో నాని – సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన ”వి” సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మెగా హీరో సినిమాని కూడా అదే విధంగా ఆన్లైన్ లో రిలీజ్ కి ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయినట్లేననే న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. అందుకే ఈ సినిమాకి ఎంత క్రేజ్ తీసుకొచ్చి ఏం లాభం చివరకు ఓటీటీ రిలీజ్ చేస్తుంటే అంటూ పెదవి విరుస్తున్నారట. ప్రస్తుతం బాగా క్రేజ్ తెచ్చుకుని ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల పట్ల కొందరు హీరోలు మరియు వారి సన్నిహితులు అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో మంచి హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ మూవీని థియేటర్స్ లోనే విడుదల చేయాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ రిలీజ్ పై సెప్టెంబర్ లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.