సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’…!

0

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కి వెళ్ళింది. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా టైటిల్ కి తగ్గట్టే పెళ్లి అంటే ఇష్టంలేని.. సోలోగా ఉండటమే బెటర్ అని అనుకునే యువకుడి కథ అని తెలుస్తోంది. ఈ సినిమాలో తేజ్ కి జోడీగా నభా నటేష్ నటించింది.

ఇప్పటికే ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ‘నో పెళ్లి’ వీడియో సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘హే ఇది నేనేనా..’ సాంగ్ మరియు ‘అమృత’ అనే బ్రేకప్ సాంగ్ కూడా సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు. వెంకట్ సి దిలీప్ కెమెరామెన్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. ‘చిత్రలహరి’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాల తర్వాత సాయి ధరమ్ తేజ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ మూవీతో మెగా మేనల్లుడు తన విజయాల పరంపర కొనసాగిస్తాడేమో చూడాలి.