బయటపడ్డ మరికొన్ని ఆడియో టేపులు

0

బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసులో ఒక వైపు సీబీఐ ఎంక్వౌరీ సాగుతోంది. మరో వైపు మీడియా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమవంతు అన్నట్లుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. జాతీయ మీడియా సంస్థల ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటికే చాలా వరకు విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు సుశాంత్ కేసుకు సంబంధించి మరికొన్ని ఆడియో టేపులు మరియు వాట్సప్ ఛాటింగ్ స్ర్కీన్ షాట్స్ ను మీడియా బయట పెట్టింది. ఈసారి సుశాంత్ కేసులో వచ్చిన ఆడియో టేపులో ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని మాట్లాడుకోవడం జరిగింది.

ఆ ఆడియో టేపులో ఉన్నది సుశాంత్ వాయిస్ గా ఫోరెన్సిక్ నిపుణులు వెళ్లడి చేశారు. ఇంతకు అందులో ఏముందంటే.. మనం ఇప్పుడు ఉన్న పరిస్థతుల్లో డబ్బు ఆదా యాలి. అది ఎలా అనేది నాకు ఏమైనా సలహా ఇవ్వగలవా. నేను నగరాన్ని విడిచి వెళ్లాలని అనుకుంటున్నా. నా మనస్సు అస్సలు బాగోలేదు. నేను నా మైండ్ తో యుద్దం చేస్తున్నాను. కొంత కాలం పాటు దూరంగా ఉండాలని ఎవరికి తెలియని చోట ఉండాలని అనుకుంటున్నట్లుగా సుశాంత్ ఆడియో టేపులో పేర్కొనడం జరిగింది. ఆ ఆడియో టేపులో సుశాంత్ తో పాటు రియా ఆమె తండ్రి మరో మహిళ కూడా మాట్లాడిన మాటలు వినవచ్చు.

ఇక సుశాంత్ ఆరోగ్య విషయమై గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా ఆయన తీవ్రమైన డిప్రెషన్ కు గురి అవుతున్నాడు అనేది రియా మరియు ఆమె సన్నిహితుల వాదన. కాని సుశాంత్ కుటుంబ సభ్యలు మాత్రం రియా వల్లే సుశాంత్ చనిపోయాడు అసలు డిప్రెషన్ అనేది సుశాంత్ కు లేదు అన్నట్లుగా వాదిస్తున్నారు. అయితే గతంలోనే సుశాంత్ ఆరోగ్యం గురించి ఆయన సోదరికి తెలుసని ఆమెతో డాక్టర్ ప్రిస్కిప్షన్ గురించి కూడా మాజీ మేనేజర్ వాట్సప్ లో ఛాటింగ్ చేసిన విషయం వెళ్లడి అయ్యింది. బయట పడ్డ ఈ ఆడియో మరియు స్క్రీన్ షాట్స్ కేసు నుండి రియాను కాస్త అయినా బయట పడేసే అవకాశం ఉందేమో అంటున్నారు.