ఎస్సీ బాలుకు ఎక్మో సపోర్ట్ తో చికిత్స

0

గాన గంధర్వుడు ప్రధాన గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఎంజీఎం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. బాలుకు ప్రస్తుతం ఎక్స్ ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్ (ఎక్మో) సపోర్టుతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఎస్పీ బాలుకు ఇప్పటికే చెన్నైలోని ఎంజీఎంలో ప్లాస్మా చికిత్స చేశారు. అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నారు. ఎస్పీ బాలు కోలుకోవాలని సినీ ఇండస్ట్రీ ప్రార్థనలు చేస్తోంది. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రతీరోజు అభిమానులతో వివరిస్తున్నారు.