ఎస్పీ బాలు కండీషన్ కొడుకు చరణ్ కన్నీటిపర్యంతం

0

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు ఆయన కోలుకోవాలని హీరోలు అభిమానులు గాయకులు ఈ సాయంత్రం దేవుడిని మూకుమ్మడిగా ప్రార్థించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ పిలుపు మేరకు ఈ ప్రార్థన జరిగింది.

ఈ క్రమంలోనే కొడుకు ఎస్పీ చరణ్ తన తండ్రి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి స్పందించారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా వణుకుతున్న గొంతుతో మాట్లాడారు. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో బాలు వెంటిలేటషన్ పైనే చికిత్స పొందుతున్నాడని తెలిపారు. బాలు ఆరోగ్యం ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు ఆయన తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులు సినీ పరిశ్రమ చూపుతున్న ఆదరణకు ధన్యవాదాలు ఎస్పీ చరణ్ తెలిపారు. ‘ఎస్పీ బాలు ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. పురోభివృద్ధి లేదు. ఆయన కోలుకోవాలని వేడుకున్న అందరికీ ధన్యవాదాలు..’ అంటూ ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వీడియోలో పేర్కొన్నారు.