‘యూట్యూబ్’లో ట్రెండ్ సృష్టిస్తున్న స్టార్ హీరోయిన్ ఫస్ట్ సాంగ్..!!

0

స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నటిగా మాత్రమే కాదు.. ఓ గాయనిగా మ్యూజిక్ కంపోజర్ గా కూడా శృతి సినీలవర్స్ కి సుపరిచితమే. అయితే ఈ టాలెంటెడ్ భామ.. ఇదివరకే ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేస్తానని చెప్పింది. ఇప్పటి వరకు శృతి యూకె అంతటా మ్యూజికల్ ప్రదర్శనలు ఇచ్చింది. అయితే తన మ్యూజిక్ టూర్లను ఇండియన్స్ మిస్ అయ్యారని చెప్పి.. అందుకోసమే తన మ్యూజిక్ టూర్లకు సంబంధించిన అన్నీ వీడియో ఫుటేజీలను ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయనుంది. ప్రస్తుతం తను సొంతంగా రూపొందించిన ఫస్ట్ ఆల్బమ్ కోసం వర్క్ చేస్తోంది శృతి. ఇటీవలే ఫ్యాన్స్ తో మాట్లాడిన శృతి.. “నేను సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా మాట్లాడాను. త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అభిమానులకు మరింత దగ్గర అవ్వాలని ఆలోచిస్తున్నా” అని తెలిపింది.

ఇక యూట్యూబ్ ఛానల్ కంటెంట్ కూడా నా సొంత ట్రాక్స్ అప్లోడ్ చేస్తాను. బిటిఎస్ ఫుటేజ్ తో పాటు నా ప్రదర్శనలు.. మ్యూజికల్ టూర్ల అన్నీ వీడియోలు అందులోనే ఉంటాయని చెప్పుకొచ్చింది ఈ భామ. అయితే తాజాగా శృతిహాసన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి తన ఫస్ట్ సాంగ్ అప్లోడ్ చేసింది. అందులో ‘ఎడ్జ్’ అనే సాంగ్ తానే స్వయంగా పాడుతూ మ్యూజిక్ ప్లే చేసింది. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. అందులో బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ ప్రెజన్స్ తో శృతి ఆకట్టుకుంటుంది. ఆ వీడియోలో శృతి మ్యూజిక్ టాలెంట్ మనం చూడవచ్చు. “సంగీతం ప్రపంచంలో ఎక్కడైనా ప్రేక్షకులపై ఆధారపడి ఉంటుంది. కళాకారుడు ప్రదర్శిస్తున్న సంగీతాన్ని వినడానికి అక్కడకు వచ్చారా లేదా అనేది పరిగణలోకి వస్తుంది. మా కోసం పాడాలని కోరుకునే వారు ఏదైనా ఇష్టంగా వినండి” అని శృతి తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ భామ క్రాక్ సినిమాలో నటిస్తుంది.