రానాను ఇకపై అది అడుగుతారట

0

టాలీవుడ్ మోస్ ఎలిజబుల్ బ్యాచిలర్ అంటూ ఇన్నాళ్లు పిలవబడ్డ రానా ఇటీవలే మిహికా బజాజ్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత మొదటి సారి రానా సుమ షో కోసం మీడియా ముందుకు వచ్చాడు. యాంకర్ సుమతో రానా సరదా సంభాషణ సాగించాడు. ఆహా కోసం సుమ చేస్తున్న ఆల్ ఈజ్ వెల్ కార్యక్రమం గత వారం నుండి స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. ట్రెండ్ అవుతున్న టాపిక్స్ ను తీసుకుని వాటిపై సుమ మాట్లాడుతూ షోను ఎంటర్టైన్మెంట్తో ముందుకు తీసుకు వెళ్తుంది.

మొదటి వారంలో విజయ్ దేవరకొండతో మాట్లాడిన సుమ రేపు ప్రసారం కాబోతున్న రెండవ వారం ఎపిసోడ్ కోసం రానా మరియు ఎమ్మెల్యే సీతక్కతో మాట్లాడటం జరిగింది. అందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. సీతక్క చేసిన సేవ కార్యక్రమాలు మరియు లాక్ డౌన్ టైమ్ లో చూసిన పరిస్థితులను గురించి మాట్లాడటం జరిగింది. ఇక ప్రోమోలో రానాతో చాలా సరదాగా మాట్లాడటం చూపించారు.

రానాను ఇన్నాళ్లు ఏ ఈవెంట్ లో అయినా పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించే వాళ్లు. ఇకపై రానా కనిపిస్తు పిల్లలు ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తామంటూ సుమ అంది. ఆవెంటనే రానా స్పందిస్తూ పెళ్లి అయ్యి నాలుగు రోజులే అయ్యింది. అప్పుడే పిల్లలా అంటూ నవ్వేశాడు. వీరిద్దరి మద్య సంభాషణలు మరింత ఆసక్తిగా సాగి ఉంటాయి. రేపటి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.