`ధృవ` కాంబో రిపీటవుతోందా.. సీక్వెల్ నిజమా?

0

`ధృవ` కాంబో రిపీటవుతోందా? అంటే అవుననే సమాచారం. ధృవ సీక్వెల్ కోసం సురేందర్ రెడ్డి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారన్నది తాజాగా ఇండస్ట్రీ వర్గాల ఇన్ సైడ్ టాక్. సక్సెస్ ఫుల్ జోడీ రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి తొలిసారిగా చేతులు కలిపారు. దాని ఫలితం 2016 స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా ధృవ సంచలన వసూళ్లను సాధించి మెగాభిమానుల్లో వాడి వేడి చర్చకు తావిచ్చింది. ఈ మూవీ కోసం రామ్ చరణ్ మేకోవర్ పైనా ఆసక్తిగా మాట్లాడుకున్నారు. కొంతకాలం క్రితం ధృవ సీక్వెల్ ప్లానింగ్ సాగుతోందని కథనాలొచ్చాయి. ఈ సూపర్ హిట్ తమిళ చిత్రం `తని ఒరువన్` అధికారిక రీమేక్ అన్న సంగతి తెలిసినదే.

తాజా సమాచారం ప్రకారం.. తని ఒరువన్ నటుడు-దర్శకుడు ద్వయం జయం రవి అతని సోదరుడు జయం రాజా సీక్వెల్ కోసం ప్లాన్ ని సిద్ధం చేశారు. 2021 ఆరంభమే తని ఒరువన్ సీక్వెల్ ని ప్రారంభించాలని భావిస్తున్నారని తెలిసింది. జయం రవి ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో నటిస్తున్నారు. పీరియడ్ డ్రామా `పొన్నియిన్ సెల్వన్`లో తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేసిన వెంటనే జయం రవి తన సోదరుడితో కలిసి `తని ఒరువన్ 2` ప్రారంభిస్తారు.

ప్రస్తుతం ఈ సీక్వెల్ గురించి సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. రానున్న రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందా? అంటే అందుకు రామ్ చరణ్ షెడ్యూల్స్ సహకరించాల్సి ఉంటుందని మెగాభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే చరణ్ .. సురేందర్ రెడ్డి మల్టిపుల్ ప్రాజెక్టులతో రెండు మూడేళ్లకు సరిపడా కమిట్ మెంట్లు ఇచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ నిర్మాతలుగానూ పలు చిత్రాలకు సన్నాహాలు చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.