Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుశాంత్ కి నిద్రలేమి క్లాస్టోఫోబియా నిజమే.. రియాకు రిలీఫ్!

సుశాంత్ కి నిద్రలేమి క్లాస్టోఫోబియా నిజమే.. రియాకు రిలీఫ్!


సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈకేసులో రియా చక్రవర్తి పేరు ప్రముఖంగా హైలైట్ అవుతోంది. తాను అమాయకురాలిని అని నిరూపించుకునేందుకు రియా శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందుకోసం మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతోంది. తాను చేసిన ఏకైక తప్పు సుశాంత్ ను ప్రేమించడం అంటూ నిర్ఘాంతపోయే ప్రకటన చేసింది. సుశాంత్ కు క్లాస్ట్రోఫోబియా ఉందని దాని కోసం మందులు తీసుకుంటున్నాడని.. సుశాంత్ కుటుంబం స్నేహితులు తొందరపడ్డారని ఆరోపించింది రియా.

2015లో సుశాంత్ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఆ ఇంటర్వ్యూలో తాను క్లాస్ట్రోఫోబియా .. నిద్రలేమితో బాధపడుతున్నానని సుశాంత్ ఒప్పుకున్నాడు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని ఒప్పుకున్నాడు. తనకు క్లాస్ట్రోఫోబియా ఉందని సుశాంత్ ఒప్పుకున్నాడు. రద్దీగా ఉన్నా.. జనసందోహం ఉన్నా భయపడే ఉద్వేగాన్ని కలగజేసే రుగ్మత ఇది. నేను ఆరుగంటలు నిదురించడం అనేదే ఒక అబద్ధం. నాకు నిద్రలేమి ఉంది కాబట్టి నేను రోజుకు 2 గంటలకు మించి నిద్రపోలేను అని సుశాంత్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన గురించి అబద్ధం ఒప్పుకోమని ఇంటర్వ్యూయర్ కోరినప్పుడు ఈ సంగతిని చెప్పాడు.

రియాకు వ్యతిరేకంగా మీడియా కథనాలు వేడెక్కిస్తున్న ఈ టైమ్ లో ఇది తనకు ఊరటనిచ్చే వీడియోనే. ఇటీవల చాలా మంది నెటిజన్లు #JusticeforRhea ఆన్లైన్ లో ట్రెండ్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేశారు. సుశాంత్ మరణం .. మనీలాండరింగ్ ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు .. ఇడి దర్యాప్తు జరుగుతున్నప్పటికీ.. కొన్ని మీడియా సంస్థలు రియాను వ్యక్తిగతంగా లక్ష్యంగా ఎంచుకున్నాయి. ఇదిలా ఉండగా రియాకు బెదిరింపుల నేపథ్యంలో భద్రత కల్పించాలని సిబిఐ నిర్ణయించింది. ఈ కేసులో నిజానిజాలేమిటి? అన్నది సీబీఐ తేల్చాల్సి ఉంది. మీడియా కానేకాదు!!