శృంగారంకు రేప్ కు బోల్డ్ గా తేడా చెప్పిన హీరోయిన్

0

హీరోయిన్ స్వరా భాస్కర్ తనపై సోషల్ మీడయాలో వచ్చే కామెంట్స్ కు ఎప్పటికప్పుడు చాలా ఘాటు రీప్లై ఇస్తుందనే విషయం తెల్సిందే. తనపై ఎవరు కామెంట్ చేసినా కూడా చూస్తూ ఊరుకోని స్వరా భాస్కర్ తాజాగా మరో నెటిజన్ కు ఘాటు రిప్లై ఇచ్చింది. ఈసారి ఆమె శృంగారం మరియు రేప్ కు సంబంధించి బోల్డ్ గా సమాధానం ఇచ్చింది. హథ్రస్ అత్యాచార సంఘటనను ఉద్దేశించి ఒక నెటిజన్ స్పందిస్తూ స్వరా భాస్కర్ నటించిన రస్ భరీ అనే వెబ్ సిరీస్ వల్లే దేశంలోని యువత చెడిపోతుంది అంటూ కామెంట్ చేశాడు. దేశంలోని యువత అంతా కూడా స్వరా భాస్కర్ నటించిన రస్ భరీ వెబ్ సిరీస్ ను చూసి తల దించుకుంటుంది అంటూ ఎద్దేవ చేశాడు.

రస్ భరీ వంటి వెబ్ సిరీస్ లు చూడటం వల్ల యువత పెడద్రోవ పడుతున్నారు. తద్వారా రేప్ లు జరుగుతున్నాయని అన్నాడు. వెబ్ సిరీస్ లో శృంగార సన్నివేశాల వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయి అంటూ అతడు చేసిన వ్యాఖ్యలపై చాలా సీరియస్ గా స్వరా భాస్కర్ స్పందించింది. అతడికి షాక్ ఇచ్చినట్లుగా ట్వీట్ చేసింది. ఇద్దరి మద్య ఏకాభిప్రాయం ఒప్పందంతో జరిగే శృంగారంలో ఎలాంటి తప్పు ఉండదు. అది చాలా సహజంగా జరిగేది. ఇద్దరు వ్యక్తులు ఇష్టంతో కలిస్తేనే నువ్వు పుట్టావు అనే విషయాన్ని గుర్తు పెట్టుకో అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. ఇద్దరి మద్య ఏకాభిప్రాయంతో జరిగే శృంగారంకు మరియు రేప్ కు మద్య మొదట నువ్వు తేడా తెలుసుకోవాలంటూ సూచించింది.

దేశంలో రేప్ లు పెరగడానికి కారణం నేను చేసిన సినిమా అంటూ వ్యాఖ్యలు చేయడం వారి అవివేకం. మైండ్ సెట్ మరియు ఆలోచన విధానం వల్ల రేప్ లు జరుగుతున్నాయి. నీవు బుర్రను ఉపయోగించి ట్వీట్ చేస్తే బాగుండేది. అప్పుడప్పుడు అయినా బుర్రను ఉపయోగించి ఆలోచించి ట్వీట్స్ చేయాలంటూ సూచించింది. రాస్ భారీ వెబ్ సిరీస్ లో పెళ్లి అయిన యువతి పాత్రలో స్వరా భాస్కర్ నటించింది. కాస్త బోల్డ్ పాత్ర అవ్వడంతో యూత్ ప్రేక్షకుల నుండి ఆ వెబ్ సిరీస్ కు విపరీతమైన ఆధరణ దక్కింది. అందుకే ఇలాంటి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.