ఈ అందాలను చెడగొట్టొద్దన్న తాప్సి

0

సొట్టబుగ్గల సుందరి తాప్సి తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ పిక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చాలా కలర్ ఫుల్ గా ఒక మంచి బ్యాక్ గ్రౌండ్ ను కలిగి ఉంది ఈ ఫొటో. సముద్రపు తీరాన ఒక ఎండి పోయిన చెట్టు మొదలును ఆనుకుని తాప్సి ఫేస్ కనిపించకుండా తీసుకున్న ఈఫొటో అందమైన నేచర్ ను చూపిస్తుంది. ఫొటోలో ఆమె ఉన్నా కూడా అంతా నేచర్ కు ఫిదా అవుతున్నారు అంటే ఎంత అందమైన బ్యాక్ గ్రౌండో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫొటోను షేర్ చేసిన తాప్సి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మన చుట్టు ఉన్న నేచర్ మనను అందంగా చూపిస్తుంది. ఎలాంటి ఫిల్టర్ లేకుండానే మన అందాన్ని పెంచుతుంది. అత్యుత్తమ బ్యాక్ గ్రౌండ్ మరియు అత్యుత్తమ లైటింగ్. మనం అంతా దీనిని ఇలాగే ఉంచాలి. ఎప్పటికి చెడగొట్టవద్దంటూ పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ కు కొన్ని గంటల్లోనే అయిదు లక్షల లైక్స్ వచ్చాయి. భారీగా కామెంట్స్ కూడా చేశారు. ఇక తాప్సి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె సౌత్ లో ఒక సినిమాతో పాటు బాలీవుడ్ లో మూడు నాలుగు సినిమాలు చేస్తుంది. ఆ సినిమాలు అన్ని కూడా 2021లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.