కరోనా మహమ్మారి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది. అటు ఆర్థికంగాను ఇటు ఆరోగ్యం పరంగాను ఎంతో నష్టం మిగిల్చింది. అయితే ఈ ఎఫెక్ట్ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలతో పాటు సినీ ఇండస్ట్రీని కూడా దెబ్బతీసింది. కానీ ఇంతకాలం షూటింగ్ ఆపేసి జాగ్రత్తలు పాటించినా.. ఇప్పుడు కరోనా మీదే సినిమాలు తీస్తున్నారు మేకర్స్. అయితే తాజాగా కరోనా టైంలో ఎదుర్కొన్న పరిస్థితులను ఆధారం చేసుకొని.. కొన్ని కాల్పనిక ఘటనలను కథనంగా మలిచి రూపొందిస్తున్న సినిమా ‘థ్యాంక్ యూ బ్రదర్’. స్టార్ టీవీ యాంకర్ అనసూయ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను రమేష్ రాపర్తి తెరకెక్కిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ను హీరో రానా దగ్గుబాటి లాంచ్ చేశారు. ఆ పోస్టర్ బట్టి చూస్తే ఓ లిఫ్ట్ దాని ఎదురుగా ఫ్లోర్ మీద పడి ఉన్న మాస్క్ కనిపిస్తున్నాయి.
టైటిల్ లోనే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పడం కరోనా కాలంలో మాస్క్ ప్రాధాన్యతను చెప్తున్నట్లే అనిపిస్తుంది. ఇక టైటిల్ పోస్టర్ తో ఆసక్తి రేపిన ఈ చిత్ర బృందం.. తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన ‘థ్యాంక్ యూ బ్రదర్’ మోషన్ పోస్టర్ సినిమా పై మరింత ఆసక్తి రేపుతుందని చెప్పవచ్చు. ‘హలో పైన ఎవరైనా ఉన్నారా.. ఉంటే రెస్పాండ్ అవ్వండి’ అనే మాటలు బట్టే లిఫ్ట్ లో ఇరుక్కుపోయారని అర్ధమవుతుంది. కానీ మోషన్ పోస్టర్ లో మరో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. లిఫ్ట్ యువకుడు ఒక గర్భిణీ ఇరుక్కుపోయినట్లు చూపిస్తూ ఆద్యంతం ఇంటరెస్ట్ ఆకట్టుకుంటున్నారు. ఎలివేటర్ (లిఫ్ట్)కు కథలో కీలక పాత్ర ఉందనే అభిప్రాయాన్ని ఈ మోషన్ పోస్టర్ తెలుపుతుంది. ప్రస్తుతం నెట్టింట ఈ మోషన్ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. అశ్విన్ విరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మాగుంట శరత్చంద్రా రెడ్డి తారక్నాథ్ బొమ్మిరిడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో విడుదలకు రెడీ అవుతుంది. చూడాలి మరి ఈ ఎక్సపరిమెంటల్ ఫిల్మ్ ఉండబోతుందో..!!
https://www.youtube.com/watch?v=-C040gesGAE
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
