Templates by BIGtheme NET
Home >> Cinema News >> బాలు ప్రాణం పెట్టేసి నటించిన ఆ మూవీ..?!

బాలు ప్రాణం పెట్టేసి నటించిన ఆ మూవీ..?!


పదహారు ప్రాయం ప్రేమ కాదు అది. ఆరుపదుల వయసులో కూడా నూతన దంపతుల్లా కాలం గడిపే జంట కథతో తెరకెక్కిన చిత్రం `మిథునం`. తనికెళ్ల భరణి దర్శకత్వం వహించారు. శ్రీరమణ కథ రాయగా దానిని భరణి తెరపై చూపించిన తీరు అసమానం. ఇందులో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం- లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. అన్యోన్యత ప్రేమాభిమానాలు అంటే ఏమిటో ఆవిష్కరించే గొప్ప సినిమా ఇది. ఒక వృద్ధ జంటగా బాలు లక్ష్మి ల్యాండ్ మార్క్ నటనతో మెప్పించారు.

ఆ జంట ప్రేమాభిమానాల్లో జీవన వేదాంతం ఇమిడి ఉంటుంది. ఇక సింగర్ గా అనువాద కళాకారుడిగా సంగీత దర్శకుడిగా ప్రజ్ఞ చూపిన బాలు నటుడిగానూ పూర్తి స్థాయి పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న సినిమా ఇది. ఎన్నో సినిమాల్లో నటించినా బాలు ఇందులో చాలా ప్రత్యేకం. ఇక ప్రేమికుడు చిత్రంలోనూ ఎస్పీబీ ప్రభుదేవాకు తండ్రిగా నటించిన తీరుకు అప్పట్లో ప్రశంసలొచ్చాయి.

ఈ సినిమాలో ప్రతి సన్నివేశం.. ఉన్న రెండు పాటలు గొప్పగా ఆకట్టుకుంటాయి. ఇక తన పాత్రలో పరకాయం చేసిన బాలు నటన క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. లక్ష్మీ అయితే జీవించారు. అందుకే ఈ మూవీ బాలు-లక్ష్మీ ఇద్దరికీ ఎంతో స్పెషల్.

ఇక బాలుకు ఎంతో సన్నిహితులైన వారిలో శివభక్తుడు తనికెళ్ల భరణి ఈ మరణవార్తతో అతఃహశుడే అయ్యారు. అలాగే పరుచూరి బ్రదర్స్ కూడా ఆయన గురించి ఎంతో కలత చెందారు. పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. “గాన గాంధర్వుడు ఎస్పీ బాలు పాటలోనే కాదు.. భాషలోనూ పండితుడు. ఆయన ఎక్కువ మాట్లాడరు. ఏది మాట్లాడినా మంచే మాట్లాడతారు. 1980లో వచ్చిన పాటల్లో చాలా వరకూ డబుల్ మీనింగ్ ఉండేవి.. మేం రచయితలుగా.. ఎస్పీ బాలు సింగర్గా చాలా సినిమాలకు పనిచేశాం. అయితే ఏదైనా పాటలో డబుల్ మీనింగ్ ఉంటే.. ఆ పాటను ఒకసారి చూసి ఆ పాటని ఎవరితోనైనా పాడించండి అని చెప్పేసేవారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భాషలో తేడా ఉంటే ఆ పాట నాకు వద్దనేవారు ఎస్పీ బాలు. పాట మధ్యలో గమ్మతైన పదాలు వస్తుండేవి.. అవి రచయిత రాసేవి కావు.. ఎస్పీ బాలు పాడినవే. వాటికి నేనే సాక్షి“ అని సుదీర్ఘ వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. నవతరం ప్రతిభావంతులకు అవకాశం కల్పించిన గొప్ప సీనియర్ ఎస్పీబీ అని కూడా తెలిపారు. ఆయనతో కలిసి పలు సినిమాలకు పని చేశామని వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 వరకూ పాడుతూ ఉండేంత బిజీ గాయకుడు ఆయన అని అన్నారు. పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఆయన కొన్ని వందల మంది గాయనీగాయకుల్ని తయారు చేశారు.

భాషా దోషం లేని గాయకుడు ఆయన. ఒక తెలుగు బిడ్డగా ఘంటసాల గారి తరువాత అలాంటి గాయకుడ్ని చూస్తామా అనుకున్న సందర్భంలో నేనున్నా అని ముందుకు వచ్చిన గాయకుడు ఎస్పీ బాలు అంటూ ఎమోషనల్ అయ్యారు పరుచూరి సోదరుడు.