Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘వి’ మిడ్ నైట్ షోతో వ్యూస్ రికార్డ్ బద్దలవ్వడం ఖాయమా?

‘వి’ మిడ్ నైట్ షోతో వ్యూస్ రికార్డ్ బద్దలవ్వడం ఖాయమా?


నాని 25వ సినిమా ‘వి’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మరో కీలక పాత్రలో సుధీర్ బాబు నటించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో నివేదా థామస్ మరియు అదితి రావు హైదరీలు హీరోయిన్స్ గా నటించారు. ఆరు నెలల క్రితం విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో వాయిదా పడింది. ఇంకా కూడా థియేటర్లు ఓపెన్ అవ్వక పోవడంతో చేసేది లేక ఓటీటీ ద్వారా రాబోతుంది.

‘వి’ సినిమాను నేడు(సెప్టెంబర్ 4) మద్య రాత్రి 12 గంటల నుండి స్ట్రీమింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఏ పెద్ద తెలుగు సినిమా కూడా ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ కాలేదు. ఇప్పటి వరకు డైరెక్ట్ రిలీజ్ అయిన సినిమాలు అన్ని కూడా మెల్లగా చూద్దాంలే ఏముంది అనుకునే సినిమాలే. కాని నాని నటించిన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఎంతో ఆసక్తిగా ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అందుకే నేడు అర్థరాత్రి తెలుగు ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్ లేదా వెబ్ సైట్ పై మూకుమ్మడి దాడి చేయడం ఖాయం అనిపిస్తుంది.

నానికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు సినిమాపై ఉన్న అంచనాల కారణంగా భారీగానే జనాలు చూసే అవకాశం ఉందంటున్నారు. అమెజాన్ ప్రైమ్ కు తెలుగు రాష్ట్రాల్లో తక్కువలో తక్కువ కనీసం పది లక్షల మంది సబ్ స్ర్కైబర్స్ అయినా ఉంటారు అనేది విశ్లేషకుల మాట. ఒక్కో సబ్ స్క్రైబర్ తన యూజర్ నేం మరియు ఫాస్ వర్డ్ ను ఇద్దరు ముగ్గరితో షేర్ చేసుకుని ఉంటారు. కనుక సినిమాను చూడబోతున్న వారి సంఖ్య భారీగానే ఉంటుందనిపిస్తుంది. అయితే ఈ రోజు రాత్రి చూసేవారి సంఖ్యతో 13 నుండి 15 మిలియన్ ల మినిట్స్ వ్యూస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇది ఇప్పటి వరకు విడుదలైన ఇండియన్ టాప్ మూవీస్ జాబితాలో చేరే అవకాశం ఉందంటున్నారు. నాని సినిమాకు వచ్చే ఆధరణను బట్టి టాలీవుడ్ నుండి మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.