Templates by BIGtheme NET
Home >> Cinema News >> మనం ఆక్రమించుకోవడం కాదు.. వారే మన మార్కెట్ పై కన్నేస్తున్నారు…!

మనం ఆక్రమించుకోవడం కాదు.. వారే మన మార్కెట్ పై కన్నేస్తున్నారు…!


భారతీయ సినీ పరిశ్రమలో బాలీవుడ్ అతి పెద్ద సినీ ఇండస్ట్రీగా గుర్తింపు పొందుతోంది. ఆ తర్వాత సౌత్ ఇండస్త్రీలైన టాలీవుడ్ కోలీవుడ్ లు కొనసాగుతున్నాయి. అయితే మార్కెట్ పరంగా ఇప్పుడు ప్రాంతీయ సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయి క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నాయి. అందుకే బాలీవుడ్ మేకర్స్ సైతం సౌత్ సినిమాలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో ఇక్కడ సూపర్ హిట్ అయిన సినిమాల రీమేక్ రైట్స్ పోటీపడి మరీ కొనుక్కుని అక్కడ రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో సక్సెస్ సాధించిన సినిమాలను హిందీలో రీమేక్ చేసి బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా సౌత్ సినిమాల శాటిలైట్ రైట్స్ తీసుకొని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ హీరోలు సైతం తమ సినిమాలను హిందీలో కూడా రిలీజ్ చేస్తూ మార్కెట్ ని విస్తరించుకుంటున్నారు. ఈ విధంగా నార్త్ లో కూడా సౌత్ ఇండస్ట్రీ వారు పాగా వేస్తున్నారని అనుకుంటున్నారు.

అయితే మనం నార్త్ ని ఆక్రమించుకోవడం కాదు.. నార్త్ వారే సౌత్ మార్కెట్ మీద కన్నేస్తున్నారని సీనియర్ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీలో హిట్ సినిమాల రైట్స్ తక్కువ రేట్లకి కొనుక్కొని అక్కడ మనకున్న క్రేజ్ ని వారు వాడేసుకుంటున్నారని అంటున్నారు. హిందీ డబ్ రైట్స్ విషయానికొస్తే కొందరు హీరోలకి 25 కోట్ల వరకు కూడా పలుకుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో చెల్లించి మరీ సినిమాలు కొంటున్నారంటే వారికి ఎంత లాభం వస్తుందో అనే విధంగా ఒక్కసారి ఆలోచించాలని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. పాన్ ఇండియా మోజులో పడిపోయిన సౌత్ ఇండస్ట్రీ వారు సాలిడ్ బిజినెస్ పై సరిగా కాన్సన్ట్రేట్ చేయకుండా బాంబే నుంచే వచ్చే థర్డ్ పార్టీ వారు ఎంత చెబితే అంతకి సినిమాలు ఇచ్చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.