డాన్స్ తోనూ అల్లాడిస్తున్న టైగర్

0

బాలీవుడ్ లేటెస్ట్ సూపర్ స్టార్ టైగర్ ష్రాఫ్. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు అయిన ఈ జూనియర్ టైగర్ సినిమా సినిమాకు తన అభిమానుల సంఖ్యను పెంచుకుంటూనే ఉన్నాడు. మంచి నటనతో పాటు యాక్షన్ సీన్స్ మరియు డాన్స్ లతో అల్లాడిస్తూనే ఉన్నాడు. ఈమద్య కాలంలో టైగర్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఉంటున్నాడు. తన ప్రతిభను ఈ లాక్ డౌన్ టైంలో ఇన్ స్టాగ్రామ్ ద్వారా చూపిస్తున్నాడు. మూడు రోజుల క్రితం 220 కేజీల బరువును ఎత్తి అందరితో వావ్ అనిపించుకున్న టైగర్ ఇప్పుడు మరో వీడియోతో ఇన్ స్టాలో ట్రెండ్ అవుతున్నాడు.

టైగర్ ష్రాఫ్ ఈమద్య కాలంలో మంచి డాన్సర్ గా కూడా మారుతున్నాడు. తన బాడీ బిల్డింగ్ కు తోడు డాన్స్ ల్లో కూడా అదరగొట్టాలనే ప్రయత్నాల్లో భాగంగా తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇటీవల టైగర్ విడుదల చేసిన ఈ డాన్స్ వీడియో ఆయన అభిమానుల సంఖ్యను మరింతగా పెంచేలా ఉంది. డాన్స్ లవర్స్ ఆయన డాన్స్ మూమెంట్స్ కు ఫిదా అవ్వాల్సిందే. ఆకట్టుకునే బాడీ లాంగ్వేజ్ తో పాటు మంచి మూమెంట్స్ తో టైగర్ చేసిన ఈ డాన్స్ అందరి వర్గాలను ఆకట్టుకుంటున్నాయి అనడంలో సందేహం లేదు. ఈ వీడియోను మూడున్నర మిలియన్ ల మంది చూశారు.

Anyone else in love with bts’ new single! #dynamite @bts.bighitofficial @paresshss @yashjain_14 @_anjalli_

null