ఈ రీమేక్స్ గోలేంటి బాబూ…!

0

తెలుగు చిత్రపరిశ్రమలో ఈ మధ్య రీమేక్ సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇతర ఇండస్ట్రీలలో సూపర్ హిట్ అయిన సినిమాల రీమేక్ రైట్స్ పోటీపడి మరి కొని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ హిందీలో సక్సెస్ సాధించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే. ఇక తమిళ్ లో మంచి విజయం సాధించిన ధనుష్ ‘అసురన్’ చిత్రాన్ని విక్టరీ వెనకటేష్ తెలుగులో ‘నారప్ప’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మలయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’ మరియు తమిళ్ హిట్ ‘వేదలమ్’ చిత్రాలను తెలుగులో రీమేక్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ – తమన్నా జంటగా నటిస్తున్న ‘గుర్తుందిగా శీతాకాలం’ కన్నడ చిత్రానికి రీమేక్. వీటితో పాటు మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ‘కప్పెల’ ‘హెలెన్’ ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే సినిమాల రీమేక్ రైట్స్ కొని పెట్టుకొని తెలుగులో తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇలా మంచి కంటెంట్ అంటూ అనేక పక్క ఇండస్ట్రీల సినిమాలు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో పరభాషా చిత్రాల వెంట పరుగులు తీయకుండా లోకల్ టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది కదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతున్న సినిమాల కంటే మంచి కంటెంట్ ఇవ్వగలిగే సత్తా లోకల్ అప్ కమింగ్ రైటర్స్ మరియు డైరెక్టర్స్ కి ఉంది. అయితే వారికి సరైన అవకాశం రాగానే మరుగున పడిపోయి ఉన్నారు. ఈ మధ్య తెలుగులో యంగ్ స్టర్స్ తీసే షార్ట్ ఫిలిమ్స్ అన్నీ ప్రపంచ వ్యాప్త ఖ్యాతిని పొందుతున్నాయి. ఎన్నో అవార్డులను రివార్డులను అందుకున్నారు. ప్రస్తుతం క్రైసిస్ సమయంలో కోట్లు ఖర్చు పెట్టి పరభాషా చిత్రాలను రీమేక్ చేయడం కంటే లోకల్ టాలెంట్ ని గుర్తించి ఇండస్ట్రీకి కొత్తవారిని పరిచయం చేస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయాడుతున్నారు. ఇలా చేస్తే టాలీవుడ్ లో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి.. అప్పుడు పక్క ఇండస్ట్రీ వారు మన సినిమాలు రీమేక్ చేయడానికి పోటీ పడతారు. దీని వల్ల తెలుగు ఇండస్ట్రీ కూడా బాగుపడుతుందని చెప్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు తీస్తూ దేశవ్యాప్తంగా మన మార్కెట్ విస్తరించాలనుకోవడం మంచిదే.. అలానే లోకల్ టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు హీరోలు.. కొన్ని నిర్మాణ సంస్థలు న్యూ టాలెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువమంది రావాలని కోరుకుంటున్నారు.