మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాలో మునుపెన్నడూ లేని జోష్ కనిపిస్తోంది. అది తన ముఖంలో ప్రతిఫలిస్తోంది. దీనికి కారణం ఏమై ఉంటుంది? అంటే.. ప్రత్యేకించి విడమర్చి చెప్పనవసరం లేదు. ఇటీవల తమన్నా తనకు నచ్చిన మంచి లక్షణాలున్న యువకుడిని ప్రేమించింది. అతడి పేరు విజయ్ వర్మ. నటుడిగా హిందీ పరిశ్రమలో వేగంగా ఎదిగేస్తున్న ఈ ప్రతిభావంతుడిలోని క్వాలిటీస్ గురించి తమన్నా ఇంతకుముందే బహిర్గతం చేసింది. కెరీర్ లో కొందరు హీరోలతో పని చేసినా కానీ వారిలో ఎవరిలోను లేని క్వాలిటీస్ విజయ్ లో ఉన్నాయని తమన్నా అంది. ఎవరూ చూపించనంత శ్రద్ధ, తన విషయంలో అతడు తీసుకునే కేరింగ్ ఎంతో గొప్పవని పేర్కొంది.
తమన్నా- విజయ్ వర్మ జంట తమ మధ్య రిలేషన్ షిప్ విషయమై బహిరంగంగా ఓపెనయ్యారు. ఆ తర్వాత వరుసగా ఈవెంట్లలోను జంటగా సందడి చేస్తున్నారు. ఇప్పుడు ముంబైలోని జియో వరల్డ్ ప్లాజా లో వరల్డ్ డ్రైవ్ ని ప్రారంభించిన సందర్భంగా ఈ ఉత్సవంలో తమన్నా-విజయ్ వర్మ జంట ప్రత్యేక ఆకర్షణగా మారారు. ముఖ్యంగా విజయ్ చారల దుస్తుల్లో ప్రయోగం చేసేందుకు వెనకాడకపోవడం ఆకట్టుకుంది. అంతకుమించి తమన్నా పాక్షికంగా బికినీ తరహా దుస్తులను ధరించి ఇన్నర్ విజిబుల్ కోట్ లో కనిపించింది. తమన్నా అందాల్ని పాక్షికంగా ఆవిష్కరిస్తోంది ఈ డ్రెస్. ర్యాంప్ పై అలా క్యాట్ వాక్ చేస్తూ అహూతుల ముందుకు విచ్చేసిన ఈ జంట షో స్టాపర్ గా నిలిచారు.
ఇక ర్యాంప్ వాక్ లో విజయ్ వర్మ తమన్నా వెంటే ఉన్నాడు. తనతో పాటే నడిచి వస్తూ వేదికను అలంకరించాడు. విజయ్ – తమన్నా చేతిలో చెయ్యేసి ఈ వేదిక వద్దకు నడుస్తున్న తీరు.. వారి మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ జంట తొందర్లోనే పెళ్లితో ఒకటవ్వాలని కూడా నెటిజనులు ఇప్పుడు కోరుకుంటున్నారు.
తమన్నా భాటియా -విజయ్ వర్మ జంట ఇటీవల ఓటీటీ సిరీస్ తో అలరించారు. ఇకపై పెద్ద తెరపైనా కలిసి నటించాలని ఆరాటపడుతున్నారు. ఈలోగా, తమ్మన్నా భాటియా హార్రర్ డ్రామా అరణ్మనై 4లో కనిపించనుంది. దర్శకుడు నిక్కిల్ అద్వానీ ‘వేదా’లో కూడా కనిపిస్తుంది. తన తదుపరి చిత్రంలో జాన్ అబ్రహంతో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకుంటోంది. విజయ్ తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
View this post on Instagram
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
