యంగ్ టైగర్ తో కంటే ముందు ఎనర్జిటిక్ స్టార్ తో..!

0

అల వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ హీరోగా ప్రకటించాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఎన్టీఆర్.. త్రివిక్రమ్ ల కాంబో మూవీ ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉంది. కాని కరోనా కారణంగా మొత్తం ప్లాన్ రివర్స్ అయ్యింది. ఎన్టీఆర్ పూర్తి చేయాల్సిన ఆర్ఆర్ ఆర్ మూవీ ఇంకా పూర్తి అవ్వలేదు. వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఎన్టీఆర్ ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిండం లేదు అంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే త్రివిక్రమ్ ఈ గ్యాప్ లో మరో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడట.

టాలీవుడ్ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎనర్జిటిక్ స్టార్ రామ్ కోసం త్రివిక్రమ్ కథ రెడీ చేశాడట. ఇటీవలే ఆ కథను కూడా రామ్ కు వినిపించాడట. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నుండి రాబోతున్నట్లుగా ఒక పీఆర్ఓ అనధికారికంగా చెప్పాడు. వీరిద్దరి కాంబో మూవీ అంటే ఖచ్చితంగా పైసా వసూల్ అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోలు ఎవరు ఖాళీ లేని కారణంగా రామ్ తో త్రివిక్రమ్ రెడీ అయ్యాడు అనేది కూడా ఒక పుకారు. అన్ని పుకార్లకు త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.