Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన ‘టక్ జగదీష్’..!

ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన ‘టక్ జగదీష్’..!


నేచురల్ స్టార్ నాని – దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ”టక్ జగదీష్”. నాని నటిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కోవిడ్ ప్రభావంతో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ నేడు(శుక్రవారం) హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఫైనల్ షెడ్యూల్ లో చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు.

కాగా ‘టక్ జగదీష్’ సినిమాలో రీతూ వర్మ – ఐశ్వర్యా రాజేష్ ఫిమేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. ఇందులో జగపతి బాబు – రావు రమేష్ – నరేష్ – నాజర్ – దేవదర్శిని – రోహిణి – మాల పార్వతి – డేనియల్ బాలాజి – తిరువీర్ – ప్రవీణ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్.ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి హిట్ సినిమా తర్వాత నాని – శివ నిర్వాణ కాంబోలో రూపొందుతోన్న ‘టక్ జగదీష్’ పై మంచి అంచనాలే ఉన్నాయి.