టాలీవుడ్ డైరెక్టర్ కి చుక్కలు చూపిస్తున్న మాజీ మిస్ ఇండియా…?

0

టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది లేటెస్టుగా ”బ్లాక్ రోజ్” అనే చిత్రాన్ని క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ మాజీ మిస్ ఇండియా ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా నటిస్తోంది. షేక్స్ పియర్ రచన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఈ ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ ని రూపొందిస్తున్నారు. ఊర్వశి రౌతెలా టాలీవుడ్ డెబ్యూగా వస్తున్న ‘బ్లాక్ రోజ్’ కథ చాలా హాట్ హాట్ గా సాగుతుందని తెలుస్తోంది.

కాగా సంపత్ నంది ప్లాన్ ప్రకారం ఈ సినిమాని ముందుగా హిందీ తెలుగు భాషల్లో తీసి.. ఆ తరువాత మిగతా భాషల్లోకి డబ్ చేద్దామనుకున్నాడట. అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం విషయంలో ఊర్వశీ రౌతేలా మేకర్స్ కి చుక్కలు చూపిస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ‘బ్లాక్ రోజ్’ సినిమాని ముందు హిందీలో రిలీజ్ చేసి ఆ తరువాత తెలుగులో విడుదల చేయాల్సిందిగా ఊర్వశి ప్రెజర్ చేస్తోందట. అంతేకాకుండా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర మిగతా షూట్ మొత్తం ముంబైలో చేయాల్సిందిగా ఈ హాట్ బ్యూటీ కండిషన్స్ పెడుతోందట. బాలీవుడ్ లో తనుకున్న ఫేమ్ పోతుందేమో అనే భయంతోనే ఊర్వశీ ఈ విధంగా ఆలోచిస్తోందట. ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీని టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్న సంపత్ నందికి అమ్మడి వ్యవహారం తలనొప్పిగా మారుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.