వేదాళం రీమేక్.. సిస్టర్ పాత్ర అనగానే కీర్తి ఆలోచిస్తోందా?

0

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రీకరణ పూర్తయిన వెంటనే వేదాళం రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ ఇప్పటినుంచే ప్రతిదీ పక్కా ప్రణాళికతో సిద్ధం చేస్తున్నారు. తాజాగా తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ ను లాక్ చేసి నటీనటులు సాంకేతిక నిపుణుల్ని ఫైనల్ చేసేస్తున్నారు.

ఈ రీమేక్ లో చిరంజీవి సోదరి పాత్రలో ఎవరు నటిస్తారు? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే పరిశ్రమలో ఓ ఇద్దరి పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. అందులో సాయి పల్లవి.. కీర్తి సురేష్ పేర్లు స్ట్రాంగ్ గా రిజిస్టర్ అవుతున్నాయి.

ఇంతకీ ఈ పాత్ర కోసం ఎవరిని ఫైనల్ చేశారు? అన్నది మాత్రం ఇంకా రివీల్ కాలేదు. చిరంజీవి కీర్తి సురేష్ కు ఓటు వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సోదరి పాత్రకు అంగీకరించాల్సిందిగా కీర్తిని గట్టి పట్టే పడుతున్నారట.

అయితే మెయిన్ స్ట్రీమ్ నాయికగా ఉన్న కీర్తి సిస్టర్ పాత్రకు అంగీకరిస్తుందా లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ఇక సాయి పల్లవి తనకు నచ్చనిది ఏదీ చేయదు అన్న సంగతి కూడా అందరికీ క్లారిటీ ఉంది.

అయితే కీర్తి కూడా కెరీర్ పరంగా అరడజను సినిమాలతో బిజీ. మహేష్ సరసన సర్కార్ వారి పాట.. రజనీకాంత్ అన్నాథే చిత్రాల్లో నటిస్తోంది. మోహన్ లాల్ మలయాళ చిత్రం మరక్కర్ లోనూ ఓ ఆసక్తికర పాత్రలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో చేయాల్సిన ఓ సినిమాని క్యాన్సిల్ చేసుకుని చిరు కోసం వేదాళం రీమేక్ కి సంతకం చేయనుందని కూడా గుసగుసలు ఇనిపిస్తున్నాయి. ఈ రీమేక్ షూట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.