వెంకీ మామ ’75’ సస్పెన్స్ కు తెర

0

స్టార్ హీరోల సినిమాల సంఖ్య మాజిక్ ఫిగర్ కు చేరిన సమయంలో అంటే 25.. 50.. 75.. 100 వ సినిమాలు చేస్తున్న సమయంలో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలు అందుకునేందుకు ఆయా హీరోలు కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మైల్ స్టోన్ సినిమాలు అవ్వడంతో ప్రత్యేకంగా ఉండాలని హీరోలు మరియు అభిమానులు కూడా కోరుకుంటారు. కనుక హీరోలు కథ మరియు దర్శకుడి విషయంలో ఎక్కువగా ఆలోచిస్తారు. గతంలో హీరోల విషయాన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది.

ప్రస్తుతం వెంకటేష్ అదే పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘నారప్ప’ సినిమా ఆయనకు 74వ సినిమా. కనుక ఆయన 75వ సినిమా ఏంటీ ఎప్పుడు ఉంటుంది ఎంత ప్రత్యేకంగా ఉంటుందా అంటూ దగ్గుబాటి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వెంకటేష్ 75 వ సినిమా విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. తన తదుపరి చిత్రాన్ని అనీల్ రావిపూడి దర్శకత్వంలోనే చేయాలని వెంకీ నిర్ణయించుకున్నాట.

75వ సినిమా అంటే కెరీర్ లో ప్రత్యేకం కనుక ఎఫ్ 3తో మరో ఎంటర్ టైన్ మెంట్ సక్సెస్ ను దక్కించుకుని అభిమానులకు కానుకగా ఇవ్వాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఎఫ్ 2 సక్సెస్ అయ్యింది. కనుక ఎఫ్ 3 తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో వెంకీ ఉన్నాడట. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో స్ర్కీన్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి మైలు రాయి సినిమాను మరో హీరోతో షేర్ చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి వెంకీ ఆ విషయంలో పెద్దగా ఆలోచన లేకుండా వచ్చే ఏడాది సమ్మర్ లో ఎఫ్ 3 మొదలు పెట్టి 2022లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట.