బోధి ధర్మను పాటించే హీరో అమ్మాయికి పడిపోయాడు!

0

ఎట్టకేలకు బాలీవుడ్ కండల హీరో విద్యత్ జమ్వాల్ ఒక అమ్మాయికి పడిపోయాడట. ఆ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. తన వ్యక్తిగత జీవితంలో ఆ అధ్యాయాన్ని ఓపెన్ చేయడమే గాక.. తాను రిలేషన్ లో ఉన్నానని తెలిపాడు. అతను తన సొంత చాట్ షో ఎక్స్-రేడ్ బై విద్యుత్ లో ఈ ప్రకటన చేశాడు.

‘ఈ అమ్మాయిని నిజంగా ఇష్టపడుతున్నాడు’ అంటూ విద్యుత్ ఆ చాట్ లో చెప్పాడు. పోరాట యోధుడు మైఖేల్ జై వైట్ తో విద్యుత్ మాట్లాడిన విద్యుత్ ఆ రహస్యాన్ని చెప్పేశాడు. “నేను ఒక అమ్మాయిని చూడటం మొదలెట్టాను. మీరు (మైఖేల్) నేను చెప్పే మొదటి వ్యక్తి. నేను ఇప్పుడే ఒకరిని చూడటం ప్రారంభించాను. నేను ఈ అమ్మాయిని నిజంగా ఇష్టపడుతున్నాను. మీరు ఇతర వనరుల ద్వారా తెలుసుకోకముందే మైఖేల్ నన్ను చెప్పడానికి ప్రేరేపించాడు“ అంటూ అసలు విషయం చెప్పాడు.

తన జీవితంలో అమ్మాయి గురించి మాట్లాడుతూ.. మేం మార్షల్ ఆర్ట్స్ చరిత్ర తెలుసుకునేందుకు చైనాకు ఎలా ప్రయాణించామో తెలుసా. “బోధిధర్మ షావోలిన్ ఆలయానికి వెళ్ళాను. నేను చైనా వెళ్ళేటప్పుడు నాకు ఉన్న విద్య ఇది. షావోలిన్ సన్యాసులకు ఎవరు బోధిస్తున్నారో ఈ వ్యక్తి ఎవరో తెలుసుకున్నా. తనతో ప్రేమలో పడ్డాను“ అని తెలిపాడు. బోధిధర్మను అధ్యయనం చేసి గౌరవించే వారితో చాట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు. అయితే తన జీవితంలో ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ? అన్నది మాత్రం విద్యుత్ చెప్పనే లేదు.