Templates by BIGtheme NET
Home >> Cinema News >> అదిరిపోయే రేంజులో రౌడీ బాలీవుడ్ ఆరంగేట్రం!

అదిరిపోయే రేంజులో రౌడీ బాలీవుడ్ ఆరంగేట్రం!


దాయాది పాకిస్తాన్ దాష్ఠీకాలకు ఎదురెళ్లి జయకేతనం ఎగురవేసే భారతీయ సైనికుల కథలతో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రజలు చూస్తారు. విక్కీ కౌశల్ నటించిన యూరి గొప్ప సక్సెస్ వెనక ఈ లాజిక్ ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. పట్టు సడలని స్క్రీన్ ప్లేతో ఆద్యంతం రక్తి కట్టించేలా సినిమాని తీస్తే బొమ్మ బ్లాక్ బస్టరేనని ప్రూవైంది.

తాజాగా అలాంటి మరో సినిమా తెరకెక్కనుంది. 2019 లో బాలకోట్ వైమానిక దాడి ఆధారంగా ఓ సినిమాని తీయాలని అభిషేక్ కపూర్ ప్రయత్నించారు. ఆయనతో సంజయ్ లీలా భన్సాలీ – టీసిరీస్ భూషణ్ కుమార్ చేతులు కలిపినట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 14 న 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది పై తెగబడిన పాక్ ముష్కరులు పుల్వామా లో ఊహించని దాడికి దిగారు. ఆ తరువాత బాలకోట్ వైమానిక దాడి జరిగింది పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ లోని జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్రవాద శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని భారత యుద్ధ విమానాలు ఫిబ్రవరి 26 తెల్లవారుజామున భారత వైమానిక దళం (ఐఎఎఫ్) వైమానిక దాడి చేసింది. ఈ దాడి సమయంలోనే పాక్ భూభాగంలో వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ చిక్కుకుపోయారు. కొద్ది రోజుల సాహసోపేతమైన జర్నీ తర్వాత అభినందన్ ని పాక్ విడుదల చేసింది.

`ఉరి`లో దాడి చేసి స్వాధీనం చేసుకోవడాన్ని సర్జికల్ స్ట్రైక్ అన్నారు. ఆ తర్వాత బాలాకోట్ దాడిని సెల్యులాయిడ్ పై వైమానిక దాడి వెనుక కథను బయటకు తీసుకురావాలని గట్టిగా నిర్ణయించారు. ఇప్పుడు మేకర్స్ హీరోని ఫైనల్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. “బాలకోట్ వైమానిక దాడిపై ఇంకా టైటిల్ నిర్ణయించని ప్రాజెక్ట్ తో సౌత్ స్టార్ విజయ్ దేవరకొండ ఘనంగా బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నారు“ అని లీకులు అందించారు. ఇప్పటికే ఫైటర్ హిందీలో నూ పాన్-ఇండియా కేటగిరీలో రిలీజ్ కానుంది. అభిషేక్ దర్శకత్వంలో పూర్తి స్థాయి హిందీ నటుడిలాగా రౌడీని ఆవిష్కరిస్తారట. భారత-పాకిస్తాన్ ప్రతిష్టంభన తరువాత 60 గంటలు పాకిస్తాన్లో బందీలుగా ఉంచిన వింగ్ కమాండర్ జాతీయ హీరో అభినందన్ వర్థమాన్ పాత్రను దేవరకొండ పోషించనున్నారు.ఈ చిత్రం పుల్వామా దాడి.. వైమానిక దాడి మరియు అభినందన్ బందిఖానాలో ఉన్నప్పటి ఎమోషన్ ని ఆవిష్కరించనుంది. పాక్ నుంచి అతను భారతదేశానికి తిరిగి చేరుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

విజయ్ స్క్రిప్ట్ ను ఇష్టపడ్డారు. నేను రెడీ అంటూ ఓకే చెప్పారు అని తెలుస్తోంది. విజయ్ ఈ ప్రాజెక్టును ఆఫర్ చేసినప్పుడు.. అతను దానిపై తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. అతను ఇంకా ప్రాజెక్టుపై సంతకం చేయకపోయినా ఖాయమైనట్టేనని తెలుస్తోంది. కోవిడ్ వ్యాప్తి ఈ ప్రాజెక్టును మరింత ఆలస్యం చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్లాలో అని వెయిటింగ్. అభిషేక్ మొదట ఆయుష్మాన్ ఖురానా- వాణీ కపూర్ లతో తన చిత్రాన్ని పూర్తి చేసి.. ఆపై దేవరకొండ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ముందుకు సాగుతాడని తెలుస్తోంది.