Templates by BIGtheme NET
Home >> Cinema News >> LCU.. ఇక ఆ క్యారెక్టర్ మాత్రం ఉండదు

LCU.. ఇక ఆ క్యారెక్టర్ మాత్రం ఉండదు


ఏడాదిన్నార క్రితం ‘విక్రమ్‌’ సినిమా సృష్టించిన రికార్డులు గురించి తెలిసిందే. లోకేశ్​ టేకింగ్‌కు, నటీనటుల పర్‌ఫార్మెన్స్‌కు ఫిదా అవని ప్రేక్షకుడే లేడు. తమిళంలోనే కాదు ఈ చిత్రం తెలుగు సహా విడుదలైన ప్రతి భాషాలోనూ బాక్సాఫీస్ వద్ద వందల కోట్లను అందుకుంది. అయితే ఈ చిత్రంలో విక్రమ్‌గా కమల్ పాత్రకు ఎంత ఆదరణ లభించిందో సంతానంగా విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను కూడా ప్రేక్షకులు అంతే ఇష్టపడ్డారు.

తాజాగా ఎల్​సీయూలో నెక్ట్స్​ రాబోయే చిత్రాల్లో విజయ్ సేతుపతి సంతానం పాత్ర కొనసాగుతుందా లేదా అనేది క్లారిటీ ఇచ్చేశారు విజయ్ సేతుపతి. వివరాళ్లోకి వెళితే.. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి చేసిన సంతానం పాత్ర.. లోకల్​గా డ్రగ్స్ మాఫియాను శాసించే వ్యక్తి. ఆ పాత్రలో నెగిటివ్ షేడ్స్, చాలా వైలెన్స్ ఉంటుందట.

అసలీ పాత్ర మొదట రాఘవ లారెన్స్ చేయాల్సింది కానీ ఆ తర్వాత విజయ్ సేతుపతికి దగ్గరికి వెళ్లడం, అది ఆయన నటించడం, ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడం జరిగింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆ క్యారెక్టర్ ఎక్కువమందికి నచ్చింది. సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించింది. విజయ్ సేతుపతి విలన్‌గా చాలా చిత్రాల్లో నటించారు కానీ.. ఈ చిత్రం సంతానం పాత్ర మాత్రం వేరే లెవెల్ అనేలా మంచి రెస్పాన్స్​ అందుకుంది.

ఈ పాత్రకు సపరేట్‌ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. నెగెటీవ్ రోలే అయినప్పటికీ.. ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. సంతానంగా నటించాడు అనడం కన్నా జీవించాడు అనడం సబబు అనేలా చేశారాయన. కానీ ఆ చిత్రంలో చివర్లో ఆయన పాత్ర చనిపోతుంది. కానీ దాన్ని క్లారిటీగా చూపించలేదు. ఈ పాత్ర ఎల్​సీయూలోని రాబోయే చిత్రాల్లో ఉంటే బాగుండు అని ప్రేక్షకులు ఆశించారు. కానీ అది ఉండదని తాజాగా లోకేశ్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చేశారు. విక్రమ్​ 2లో కమల్​ ఢీ కొనబోయే పాత్ర మరింత బలంగా, బ్రాండ్​గా ఉంటుందని చెప్పారు. ఆ విలన్ పాత్ర.. డ్రగ్స్ సామ్రాజ్యాన్ని మళ్లీ నిర్మించి సూర్య రోలెక్స్​ పాత్రకు సహాయంగా ఉంటుందని స్పష్టత ఇచ్చారు. త్వరలోనే ఆ పాత్రల కోసం ఇతర నటులను ఎంపిక చేస్తారని చెప్పారు.