Templates by BIGtheme NET
Home >> Cinema News >> బిగ్ బాస్ 7 : టాప్ 5.. టైటిల్ విన్నర్..

బిగ్ బాస్ 7 : టాప్ 5.. టైటిల్ విన్నర్..


బిగ్ బాస్ సీజన్ 7 మరో రెండు వారాలు మాత్రమే ఉంది. లాస్ట్ వీక్ జరిగిన ఫినాలే పాస్ టాస్క్ లో అనూహ్యంగా అర్జున్ అది దక్కించుకున్నాడు. చివరి వరకు అమర్ దీప్ టాప్ లో ఉండగా అర్జున్, అమర్ మధ్య జరిగిన చివరి టాస్క్ లో అర్జున్ గెలిచి ఫినాలే పాస్ కైవసం చేసుకున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన అర్జున్ ఫినాలే పాస్ గెలవడంతో టాప్ 5 లెక్కలు కూడా మారాయి. అర్జున్, ప్రియాంక, యావర్ వీరిద్దరిలో ఒకరికి మాత్రమే టాప్ 5 లో స్థానం ఉంటుందని అనుకున్నారు.

అర్జున్ ఫినాలే పాస్ గెలిచే సరికి యావర్, ప్రియాంకల మధ్య ఫైట్ జరుగుతుంది. బయట ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ని.. వారు వేస్తున్న ఓటింగ్ ని బట్టి చూస్తే టాప్ 3 లో కచ్చితంగా శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ లు ఉంటారని తెలుస్తుంది. ఇక ఫినాలే పాస్ గెలిచి అర్జున్ మొదటి టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచాడు. సో టాప్ 4 దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇక టాప్ 5లో యావర్, ప్రియాంక ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉంటుంది.

టాప్ 5 లో యావర్, ప్రియాంకా ఈ ఇద్దరికి అర్హత ఉందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ వారం గౌతం కృష్ణ ఎలిమినేట్ అవుతుండగా ఈ సీజన్ విజేతగా ఎవరి నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మొన్నటిదాకా శివాజి టాప్ ప్లేస్ లో ఉండగా గత వారం గ్రాఫ్ తగ్గింది. అమర్ దీప్ కూడా ఒక్కోసారి టైటిల్ విజేతగా నిలుస్తాడన్న సమీకరణాలు వచ్చాయి. కానీ ఇప్పుడు కేవలం కామన్ మ్యాన్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కే టైటిల్ విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది.

టైటిల్ రేసులో పల్లవి ప్రశాంత్ వర్సెస్ శివాజి వీరిద్దరి మధ్య ఉంటుందని టాక్. ఈ సీజన్ కామన్ మ్యాన్ గా వచ్చి క్రేజ్ తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్ గెలిస్తే మాత్రం రికార్డ్ అని చెప్పొచ్చు. మరో రెండు వారాలు ఉన్నాయి కాబట్టి ఈ మధ్యలో ఏదైనా జరగొచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం టాప్ 3 ప్లేస్ లో పల్లవి ప్రశాంత్, శివాజి, అమర్ దీప్ లు ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 7 హోస్టింగ్ విషయంలో కూడా నాగార్జున అదుర్స్ అనిపిస్తున్నారు. ఇంతకుముందు సీజన్ల కన్నా ఈ సీజన్ నాగార్జున తన హోస్టింగ్ అదరగొట్టేస్తున్నారు.