ప్రారంభంలో ఊపేసిన ఆ ఏటీటీ ఊసే లేదుగా…!

0

సౌత్ ఇండియాలో అతి పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ వారు ఇండస్ట్రీలో పలు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. సినిమాకి సంబంధించిన ఏ ఈవెంట్ ఉన్నా ఫస్ట్ వారి వద్దకే వెళ్లే రేంజ్ కి చేరుకుంది. అయితే కరోనా కారణంగా చాలా రోజులుగా సినిమాకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్స్ జరగలేదు. దీంతో ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్ తో కలిసి సినిమాల విడుదల విషయంలో ఏటీటీ అనే కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. ఈ క్రమంలో మొదట్లో ఆ ఏటీటీ మంచి ఆదరణ తెచ్చుకున్నప్పటికీ.. ప్రెజెంట్ నాసిరకం కంటెంట్ ని స్ట్రీమింగ్ కి పెడుతూ ఆడియన్స్ ని దూరం చేసుకుంటోందని టాక్ వినిపిస్తోంది.

కాగా ఇటీవల ఆ ఏటీటీ యాప్ లో అప్లోడ్ చేస్తున్న సినిమాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. విడుదలకు నోచుకోని సినిమాలు.. రెండు మూడేళ్లు హార్డ్ డిస్క్ లోనే ఉండిపోయిన సినిమాలు ఇప్పుడు ఈ ఏటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో కొత్త కంటెంట్ అప్లోడ్ చేస్తుంటే వీరు మాత్రం ఓల్డ్ కంటెంట్ ని చూపిస్తున్నారు. అందుకే ఈ ఏటీటీ వైపు ఎవరూ చూడటం లేదని తెలుస్తోంది. ఇది సరిపోదన్నట్లు బోనస్ గా ఇప్పుడు ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని ఓ ఫ్యామిలీ హీరోలందరూ దూరం పెట్టేసినట్లే అనే టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఈవెంట్స్ కి ఇప్పుడప్పుడే పర్మిషన్స్ వచ్చే సిచ్యుయేషన్ లేదు. దీంతో సదరు ఈవెంట్ ఆర్గనైజేషన్ వారు ఇప్పుడు మళ్ళీ సినిమా ప్రొడక్షన్ లోకి దిగుతున్నారు. గతంలో ఓ సినిమా ప్రొడ్యూస్ చేసి చేతులు కాల్చుకున్న ఈవెంట్ మేనేజ్మెంట్ టీమ్.. ఇప్పుడు మళ్ళీ సాహసం చేస్తోంది. మరి వారు తీసే సినిమాలను వాళ్ళ యాప్ లోనే రిలీజ్ చేసుకుంటారేమో అని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు.