నాని ‘V’ వ్యూయర్ షిప్ తగ్గిపోనుందా…?

0

నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి – నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. నాని కెరీర్లో 25వ చిత్రం ‘వి’ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో ‘వి’ చిత్రాన్ని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అయితే డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఫస్ట్ క్రేజీ మూవీ ‘V’ వ్యూయర్ షిప్ ఎలా ఉండబోతోందని ఇండస్ట్రీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంటే మరికొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టే అవకాశాలు ఉండటంతో మేకర్స్ అందరూ ‘వి’ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

కాగా ‘వి’ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని ప్రకటించగానే ఈ మూవీకి వచ్చిన క్రేజ్ ని మెయింటైన్ చేయడంలో ‘వి’ టీమ్ ఫెయిల్ అయిందని ఓటీటీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సబ్ స్క్రిప్షన్స్ ఉన్న అమెజాన్ ప్రైమ్ వారు తమ ఖాతాదారులకి నోటిఫికేషన్స్ పంపినా అందులో ఎంత మంది ఈ సినిమా చూస్తారన్నదే ఇప్పుడు ‘వి’ రిజల్ట్ ని నిర్ణయించనుంది. అమెజాన్ వారు ఇలాంటి పెద్ద సినిమాల్ని డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేసినప్పుడు ఓటీటీకి క్రేజ్ రావడంతో పాటు.. తమ సబ్ స్క్రిప్షన్స్ ని పెంచుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ‘V’ టీమ్ తమ సినిమాకు వచ్చిన బజ్ ని కొనసాగించడంలో విఫలం చెందారనే టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నాని రేంజ్ హీరో వ్యూయర్ షిప్ బాగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని సినీ నిపుణులు అభిప్రాయం.

ఇదిలా ఉండగా పైరసీ సైట్స్ ‘V’ సినిమా వ్యూయర్ షిప్ కి మరో అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కొన్ని గంటల్లోనే పైరసీ సైట్స్ లో ప్రత్యక్షం అవుతోంది. అందులోను సబ్ టైటిల్స్ తో కూడిన హెచ్ డి ప్రింట్ అందుబాటులో ఉంటుంది. అలాంటప్పుడు డబ్బులు పెట్టి కొత్తగా సబ్ స్క్రిప్షన్స్ తీసుకోవడం ఎందుకని ఆలోచించేవారు కూడా లేకపోలేదు. ఓటీటీ మూవీకి వ్యూయర్ షిప్ వచ్చినా రాకున్నా ప్రొడ్యూసర్స్ కి ఏమి నష్టం లేదు. కానీ హీరో మార్కెట్ పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యూయర్ షిప్ వస్తేనే ఓటీటీలు ఫ్యాన్సీ రేట్స్ కి సినిమాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ‘వి’ సినిమా వ్యూయర్ షిప్ ఎలా ఉంటుందనేది చూడాలి.