కేజీఎఫ్ 2 కు యశ్ అందుకుంటున్న పారితోషికం?

0

జీఎఫ్ సినిమాకు ముందు వరకు కన్నడ సినిమా పరిశ్రమలో 50 కోట్లు వసూళ్లు చేసిన సినిమా అంటే చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా భావించేవారు. ఇక కన్నడ సినిమా వంద కోట్లు అనేది కల అనుకునే వారు. అలాంటిది కేజీఎఫ్ సినిమా వందల కోట్ల వసూళ్లను రాబట్టింది. కన్నడ సినిమా పరిశ్రమ స్థాయిని ఆల్ ఇండియా స్థాయిలో చాటి చెప్పిన కేజీఎఫ్ కు యశ్ మొదట పారితోషికం తీసుకోకుండా విడుదలైన తర్వాత లాభాల్లో నుండి వాటా తీసుకున్నారు. కేజీఎఫ్ వంటి భారీ సినిమా బడ్జెట్ కష్టంగా మారడంతో పాటు ఈ సినిమా వర్కౌట్ అవుతుందా అనే అనుమానాలు ఉండటంతో నిర్మాతలు వెనుక ముందు ఆడారు. ఆ సమయంలో యశ్ తనకు పారితోషికం ఇవ్వనక్కర్లేదు. విడుదలైన తర్వాత లాభాల్లో వాటా తీసుకుంటాను అన్నాడట. అలా మొదటి పార్ట్ యశ్ పారితోషికం తీసుకోకుండానే చేసినా లాభాల వాటాతో అతడికి కన్నడ హీరోల్లోనే అత్యధిక పారితోషికం దక్కింది.

ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా తెరకెక్కుతుంది. ఈ సారి నిర్మాతలు యశ్ కు దాదాపుగా పాతిక కోట్ల వరకు పారితోషికంగా ముందే ఇచ్చారట. అది మాత్రమే కాకుండా లాభాల్లో వాటాను కూడా ఖరారు చేశారట. కేజీఎఫ్ 2 కు ఉన్న క్రేజ్ కారణంగా ఈసారి కూడా ఈజీగా మూడు వందల కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. కనుక యశ్ కు పాతిక కోట్లను మించి లాభాల్లో షేర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. కన్నడ మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం కేజీఎఫ్ 2కు యశ్ కు కనీసం రూ. 50 కోట్లు అయినా వస్తాయి. సినిమా భారీ విజయాన్ని సాధిస్తే ఆ లాభాల షేర్ మరింత పెరిగి యశ్ పారితోషికం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కన్నడ స్టార్ హీరోలు సూపర్ స్టార్ హీరోలు ఎవరు కూడా ఈ స్థాయి పారితోషికంను దక్కించుకోలేదు. సౌత్ లోనే టాప్ పెయిడ్ హీరోల జాబితాలో కేజీఎఫ్ 2 తో యశ్ నిలిచే అవకాశం ఉందని కన్నడ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.