Templates by BIGtheme NET
Home >> Cinema News >> సమంత చేతుల మీదుగా ‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ బైట్..!

సమంత చేతుల మీదుగా ‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ బైట్..!


‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ”జాంబీ రెడ్డి” అనే వైవిధ్యమైన చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జాంబీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంతో తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ బైట్ ని డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఈ ఫస్ట్ బైట్ వీడియోను రేపు ఉదయం 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ.. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ సినిమాలో ఆమెకు మనవడిగా కనిపించాడు. ఇప్పుడు మనవడి సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత సామ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే విడుదలైన ‘జాంబీ రెడ్డి’ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. మెగాస్టార్ చిరంజీవి – యంగ్ రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. కోవిడ్ నేపథ్యంలో చివరి షెడ్యూల్ ప్రారంభించిన చిత్ర యూనిట్.. షూటింగ్ మొత్తం పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఆనంది – దక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇది జాంబీ కథాంశంతో వస్తున్న మొట్ట మొదటి తెలుగు సినిమా. కర్నూల్ బ్యాగ్రౌండ్ లో వస్తున్న ఈ ఫిక్షనల్ జాంబీ తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి స్క్రిప్ట్స్ విల్లే స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. అనిత్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. మార్క్ కె.రాబిన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ‘జోంబీ రెడ్డి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.