ఎన్నికల ముందే ఇండియన్ 2 పూర్తి చేయాలన్నుకుంటున్న కమల్

0

కమల్ హాసన్.. శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు ఇన్నాళ్ల తర్వాత సీక్వెల్ ను మొదలు పెట్టారు. గత ఏడాదిలో ప్రారంభం అయిన ఇండియన్ 2 సినిమా అనేక కారణా వల్ల షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. క్రేన్ యాక్సిడెంట్ అవ్వడంతో షూటింగ్ నిలిచి పోగా.. ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు మొదలు పెట్టేది ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వడం లేదు. వచ్చే ఏడాది సమ్మర్ లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ఎన్నికల కోసం కమల్ మార్చి నుండే ప్రచారం మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

ఎన్నికలకు వెళ్లడానికి ముందే ‘ఇండియన్ 2’ సినిమాతో పాటు కమిట్ అయిన ప్రాజెక్ట్ లు అన్నింటిని కూడా ముగించేయాలని కమల్ భావిస్తున్నాడట. అందుకే దర్శకుడు శంకర్ తో ఇప్పటికే మాట్లాడి మార్చి లోపే షూటింగ్ ను పూర్తి చేయాలంటూ డెడ్ లైన్ పెట్టాడట. ఆ తర్వాత కనీసం ఆరు నెలల వరకు అందుబాటులో ఉండను అంటూ చెప్పాడట. దానికి శంకర్ నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.

శంకర్ ఇండియన్ 2 సినిమా ఆరంభ సమయంలో చాలా ఆసక్తిని కనబర్చాడు. కాని కొన్ని అనివార్య అవాంతరాలు రావడంతో ఆయన ఆసక్తి తగ్గిపోయింది అంటూ తమిళ సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించి కొంత మొత్తంను షూట్ చేశారు కనుక ఇప్పుడు వదిలేసే అవకాశం లేదు. శంకర్ పూర్తి చేయాల్సి ఉంది. అది ఎప్పుడు అనేది ఇప్పుడు కమల్ అభిమానులను వేదిస్తున్న ప్రశ్న. కమల్ మాత్రం ఇండియన్ 2 ను వెంటనే పూర్తి చేసేందుకు రెడీగా ఉన్నాడట.