మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లి!?

0

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. ”ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి..” అని ట్వీట్ చేసిన సాయిధరమ్ తేజ్.. ”సింగిల్స్ ఆర్మీ” అనే వాట్సాప్ గ్రూప్ కి సంబంధించిన ఛాట్ వీడియో షేర్ చేశాడు. మరిన్ని వివరాలు రేపు ఉదయం 10 గంటలకు అని పేర్కొన్నాడు. దీంట్లో విలక్షణ నటుడు ఆర్.నారాయణమూర్తి ఫోటోను గ్రూప్ ఐకాన్ గా పెట్టిన ఈ వాట్సాప్ గ్రూప్ లో ప్రభాస్ – నితిన్ – రానా – వరుణ్ తేజ్ – సాయిధరమ్ తేజ్ లు సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ గ్రూప్ లో నుండి నితిన్ ముందుగా లెఫ్ట్ అవ్వగా.. రానా తర్వాత ఎగ్జిట్ అయ్యాడు. ఈ క్రమంలో ‘ఇట్స్ మై షో టైమ్.. సారీ ప్రభాస్ అన్నా’ అంటూ మెసేజ్ పెట్టి తేజ్ కూడా ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యిపోయాడు. అయితే అదే సమయంలో తాను ప్రస్తుతం నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా అప్డేట్ రేపు ఉదయం 10 గంటలకు అని ప్రొడ్యూసర్స్ చేసిన ట్వీట్ ని రీ ట్వీట్ చేశాడు. దీంతో ఇప్పుడు తేజ్ షేర్ చేసిన క్లిప్పింగ్ సినిమా ప్రమోషన్ లో భాగమా లేదా తన జీవితంలో ముఖ్యమని విషయాన్ని చెప్పబోతున్నాడా అని అందరూ ఆలోచిస్తున్నారు.

కరోనా సమయంలో టాలీవుడ్ యువ హీరోలందరూ పెళ్లిళ్లు చేసుకుంటూ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడు కాగా.. మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ రానా మరియు నితిన్ లు కూడా తాము ప్రేమించిన వారిని పెళ్లిచేసుకున్నారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ పోస్ట్ ద్వారా అతను కూడా పెళ్లి న్యూస్ చెప్పబోతున్నాడా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అసలు మేటర్ ఏంటన్నది తెలియాలి అంటే రేపు ఉదయం 10 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ‘చిత్రలహరి’ ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో నటిస్తున్నాడు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.