వార్ బ్యూటీ బర్త్ డే చిలౌట్ తో గుండె గిల్లిందిగా

0

యష్ రాజ్ ఫిలింస్ లో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది టాప్ మోడల్ కం నటి వాణీ కపూర్. ఒక రకంగా ఆ బ్యానర్ ఆస్థాన నాయికగా ఈ అమ్మడు సుపరిచితం. యశ్ రాజ్ ఫిలింస్ రూపొందించిన `బ్యాండ్ బాజా బరాత్` ని ఆహా కళ్యాణం పేరుతో తెలుగు-తమిళంలో రీమేక్ చేస్తే ఇక్కడా వాణీనే అవకాశం వరించింది. అలా సౌత్ కి సుపరిచితమైన ఈ బ్యూటీ తొలి చిత్రంతో ఏమాత్రం మెప్పించడంలో చతికిలబడింది.

ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చాక ఓ బంపర్ హిట్ అందుకుంది. హృతిక్ – టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషించిన వార్ చిత్రంలో వాణీ నటనకు డ్యాన్సులకు యూత్ ఫిదా అయిపోయారు. వేడెక్కించే పోల్ డ్యాన్సులతో పాటల్లో మైమరిపించింది ఈ డస్కీ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా క్రేజీ ఆఫర్లను ఒడిసి పట్టుకుంది.

సోషల్ మీడియాల్లో వాణీ రెగ్యులర్ గా అభిమానులకు టచ్ లో ఉంటోంది. రకరకాల ఫోటోషూట్లను షేర్ చేస్తూ వేడెక్కించేస్తోంది. బికినీ.. స్విమ్ సూట్.. వర్కవుట్.. యోగా.. ఏం చేసినా వాణీ ఆ ఫోటోల్ని షేర్ చేసింది. నేడు బర్త్ డే సందర్భంగా వాణీ లేటెస్ట్ ఫోటోషూట్ ని షేర్ చేసింది.

వాణీ కెరీర్ సంగతి చూస్తే.. యశ్ రాజ్ ఫిలింస్ లోనే భారీ హిస్టారికల్ మూవీ `సంషేరా`లోనూ వాణీ కథానాయికగా నటిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కించిన ఈ సినిమాని అంతే భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ ఉన్నా… కోవిడ్ వల్ల అది వాయిదా పడింది.