Templates by BIGtheme NET
Home >> GADGETS >> యాపిల్ మరో బడ్జెట్ ఫోన్: ఈసారి ఐఫోన్ 12 మినీ కూడా?

యాపిల్ మరో బడ్జెట్ ఫోన్: ఈసారి ఐఫోన్ 12 మినీ కూడా?


2020లో యాపిల్ కొత్త ఐఫోన్లను రూపొందించడంలో బిజీగా ఉంది. అయితే ఈసారి ఐఫోన్ 12 మినీ కూడా కొత్తగా లాంచ్ కానుందని సమాచారం. ఐప్యాడ్ మినీ, మ్యాక్ మినీల తరహాలో ఈ ఐఫోన్ 12లో కూడా మినీ వెర్షన్ రానుంది. ఇప్పటివరకు ఐఫోన్‌లో మినీ వెర్షన్‌ను యాపిల్ లాంచ్ చేయలేదు.

ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ లవ్‌టుడ్రీమ్ అనే ట్వీటర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. ఐఫోన్ 12 సిరీస్‌లో ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఫోన్లు రానున్నట్లు ఈయన ట్వీటర్ ద్వారా తెలిపారు. ఐఫోన్ 12 మినీ బ్యాక్ కవర్లు, కేసులు కూడా లాంచ్ అయినట్లు మరో టిప్ స్టర్ తెలిపారు.

ఐఫోన్ 12 మినీలో 5.4 అంగుళాలు, ఐఫోన్ 12లో 6.1 అంగుళాల స్క్రీన్ ఉండనుందని సమాచారం. ఐఫోన్ 12 మినీ డిజైన్.. ఐఫోన్ ఎస్ఈ 2020 తరహాలో ఉండనుందని తెలుస్తోంది. ఈ రెండిటి ధరలో ఉండే తేడా వినియోగదారులు ఏ ఫోన్ కొనాలో నిర్ణయించుకునేలా చేసే అవకాశం ఉంది.

కొత్త ఐఫోన్ల గురించి పుకార్లు రావడం ఇదేమీ కొత్త కాదు. ఎప్పట్నుంచో ఈ పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే యాపిల్ తొలిసారి తన ఐఫోన్లలో మినీ అనే పదాన్ని ఉపయోగించడమే కాస్త కొత్తగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు శాంసంగ్ XR, SE వంటి పేర్లను తక్కువ ధర ఫోన్లకు ఉపయోగించింది.

ఈ కొత్త ఐఫోన్ల లాంచ్‌కు సంబంధించిన యాపిల్ వచ్చే నెల వర్చువల్ ఈవెంట్‌ను నిర్వహించనుందని సమాచారం. త్వరలో వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.