Home / GADGETS / కరోనా తర్వాత చైనా నుంచి మరో ప్రమాదం.. ఈ 24 యాప్స్ వెంటనే డిలీట్ చేసేయండి!.

కరోనా తర్వాత చైనా నుంచి మరో ప్రమాదం.. ఈ 24 యాప్స్ వెంటనే డిలీట్ చేసేయండి!.

కరోనా వైరస్ తర్వాత చైనా నుంచి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. అయితే ఇది మనుషుల ప్రాణాలను తీసే వైరస్ కాదు. వారి సమాచారాన్ని దొంగిలించే వైరస్. ఈ ప్రమాదకరమైన మాల్ వేర్ ఉన్న యాప్స్ ను ఇప్పటికే 38.2 కోట్ల మంది ఇన్ స్టాల్ చేసుకున్నారు. అసలు విషయం ఏంటంటే.. డేటాను సేకరించి, చైనీస్ సర్వర్‌లకు పంపుతున్న 24 యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ తొలగించినట్లు తెలిసింది. ఈ 24 యాప్ ల్లో ప్రమాదకరమైన మాల్ వేర్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ యాప్స్ అన్నీ ఒకే చైనా సంస్థకు చెందినవిగా తెలుస్తోంది. అయితే గూగుల్ యాప్ మార్కెట్లోకి మాత్రం వేర్వేరు డెవలపర్ అకౌంట్లతో వీటిని పంపిణీ చేశారు. ఈ యాప్స్ ను మొదట వీపీఎస్ ప్రో వారు గుర్తించారు. యాంటీ వైరస్ యాప్స్ వేర్వేరు అనవసరమైన పర్మిషన్లను అడుగుతున్నప్పుడు వారికి అనుమానం వచ్చింది. అసలు ఆ ఏ సంస్థకు చెందిన యాప్స్? ఈ 24 యాప్స్ ఏవి? అనే విషయం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి!

​24 యాప్స్.. 38.2 కోట్ల డౌన్ లోడ్స్

వీపీఎన్ ప్రో బ్లాగ్ పోస్ట్ ప్రకారం టీసీఎల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన షెన్‌జెన్ హాక్ అనే చైనా సంస్థ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా 24 యాప్స్ ను అందిస్తుంది. ఈ యాప్స్ ను 38.2 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇవి ప్రమాదకరమైన అనుమతులను అడగటంతో పాటు మరియు కొన్ని మాల్ వేర్, రోగ్ వేర్లను కలిగి ఉన్నాయి. ఈ రోగ్‌వేర్ అనువర్తనాలు మీ సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నట్లు సోఫోస్ చెప్పారు, అదే సమయంలో మిమ్మల్ని డబ్బు చెల్లించాల్సిందిగా బలవంతం చేస్తాయి.

​వైరస్ క్లీనర్ యాప్ కూడా!

షెన్‌జెన్ HAWK అందిస్తున్న కొన్ని యాప్స్ లో కోటి డౌన్ లోడ్లు ఉన్న వెదర్ యాప్, 10 కోట్ల డౌన్‌లోడ్‌లు ఉన్న సౌండ్ రికార్డర్ యాప్, 5 కోట్ల మిలియన్ డౌన్‌లోడ్‌లు ఉన్న ఫైల్ మేనేజర్ యాప్, 10 కోట్ల డౌన్‌లోడ్‌లతో సూపర్ క్లీనర్ యాప్, మరో 10 కోట్ల డౌన్‌లోడ్‌లు ఉన్న వైరస్ క్లీనర్ యాప్ కూడా ఉన్నాయి.

​వెంటనే తొలగించిన గూగుల్!

ఈ యాప్స్ గురించి గురించి ఫోర్బ్స్ గూగుల్‌ను సంప్రదించిన అనంతరం గూగుల్ వెంటనే వాటిని ప్లే స్టోర్ నుండి తొలగించినట్లు బ్లాగ్ పోస్ట్ తెలిపింది. “భద్రత మరియు గోప్యతా ఉల్లంఘనల నివేదికలను తీవ్రంగా పరిగణిస్తాం” అని గూగుల్ ఫోర్బ్స్ కు ప్రకటన ద్వారా తెలిపింది. తమ విధానాలను ఉల్లంఘిస్తున్నట్లు తెలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వివరించింది.

​ఆడిట్ చేస్తాం!

షెన్‌జెన్ హాక్ యాప్స్ ను గూగుల్ తొలగించిన తరువాత టీసీఎస్ కార్పొరేషన్ వీపీఎన్ ప్రోకు ప్రతిస్పందించింది. తన యాప్స్ తో ఉన్న సమస్యలను అర్థం చేసుకోవడానికి గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. కస్టమర్ల భద్రత కోసంను తన యాప్‌లకు సెక్యూరిటీ ఆడిట్ కూడా నిర్వహించాలని కంపెనీ యోచిస్తోంది. షెన్‌జెన్ హాక్ అందించే అనేక యాప్ లు ఆల్కాటెల్ మరియు టీసీఎల్ కార్పొరేషన్ విక్రయించే ఇతర ఫోన్‌లలో ప్రీలోడెడ్ గానే ఉంటాయి.

​మొదటి నాలుగు యాప్స్ ఇవే!

1. వరల్డ్ జూ(World Zoo)

2. పజిల్ బాక్స్(Puzzle Box)

3. వర్డ్ క్రాసీ(Word Crossy!)

4. సాకర్ పిన్ బాల్(Soccer Pinball)

​వీటిని కూడా డిలీట్ చేసేయండి!

5. డిగ్ ఇట్(Dig it)

6. లేజర్ బ్రేక్(Laser Break)

7. వర్డ్ క్రష్(Word Crush)

8. మ్యూజిక్ రోమ్(Music Roam)

​ప్రమాదకరమైన బ్రౌజర్ కూడా

9. ఫైల్ మేనేజర్(File Manager)

10. సౌండ్ రికార్డర్(Sound Recorder)

11. జాయ్ లాంచర్(Joy Launcher)

12. టర్బో బ్రౌజర్(Turbo Browser)

​వాతావరణ యాప్ కూడా!

13. వెదర్ ఫోర్ కాస్ట్(Weather Forecast)

14. క్యాలెండర్ లైట్(Calendar Lite)

15. క్యాండీ సెల్ఫీ కెమెరా(Candy Selfie Camera)

16. ప్రైవేట్ బ్రౌజర్(Private Browser)

​వైరస్ క్లీనర్ లో కూడా వైరస్!

17. సూపర్ క్లీనర్(Super Cleaner)

18. సూపర్ బ్యాటరీ(Super Battery)

19. వైరస్ క్లీనర్(Virus Cleaner 2019)

20. హై సెక్యూరిటీ 2019(Hi Security 2019)

​ఆఖరి 4 యాప్స్ ఇవే!

21. హై వీపీఎన్, ఫ్రీ వీపీఎన్(Hi VPN, Free VPN)

22. హై వీపీఎన్ ప్రో(Hi VPN Pro)

23. నెట్ మాస్టర్(Net Master)

24. క్యాండీ గ్యాలరీ(Candy Gallery)

Related Images:

SEO Keywords: Not Found

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top